ప్యూన్ దుర్మార్గ‌పు చ‌ర్య‌! మంచినీళ్లు అడిగిన జ‌డ్జికి గ్లాసులో నీటితో పాటు..!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి ఓ ప్యూన్‌. జిల్లా ఫ‌స్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయ‌స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి వ‌ద్ద ప‌నిచేసే, ప్ర‌భుత్వం నియ‌మించిన వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు అత‌ను. అత‌ను చేసే ప‌నులు చూస్తోంటే ఒళ్లు జ‌ల‌ద‌రించ‌డం ఖాయం. అత‌నిపై ఏహ్య‌భావం త‌న్నుకొని రావ‌డం ఖాయం. న్యాయ‌మూర్తికి ఇచ్చే మంచినీటి గ్లాసులో ఎంగిలి ఊసి ఇచ్చాడు.

త‌ల‌చుకోవ‌డానికే వెగ‌టు పుట్టించే ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అలీగ‌ఢ్‌లో చోటు చేసుకుంది. ఆ న్యాయ‌మూర్తి పేరు జ‌స్టిస్ ప్రేమ్‌కుమార్‌. అలీగ‌ఢ్ జిల్లా ఫ‌స్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌నిచేస్తున్నారు. ఆ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడి పేరు కిష‌న్ (పేరుమార్చాం).

అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం రావ‌డంతో.. త‌న ఛాంబ‌ర్‌లో ర‌హ‌స్యంగా ఓ సీసీటీవీ కెమెరాను పెట్టించారు న్యాయ‌మూర్తి. అత‌నికి మంచినీటిని తెమ్మ‌ని చెప్పారు. కూలింగ్ ఫ్లాస్క్‌లో ఉన్న మంచినీటిని గ్లాసులో పోసి, అందులో ఎంగిలి ఊయ‌డం సీసీటీవీ కెమెరాలో స్ప‌ష్టంగా రికార్డ‌య్యింది.

దీన్ని చూసిన వెంట‌నే ప్రేమ్‌కుమార్ భ‌గ్గుమ‌న్నారు. అత‌ణ్ని వెంట‌నే విధుల నుంచి త‌ప్పించారు. విచార‌ణ‌కు ఆదేశించారు. గ‌త శుక్ర‌వారం చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అత‌నిపై కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here