మేమంతా ఒకే ఫ్యామిలీ అని చెబుతుంటారు గానీ..ఏదో తేడా కొడుతోంది!

హైద‌రాబాద్‌: న‌ంద‌మూరి ఫ్యామిలీ అంతా ఒక్క‌టే అని చెబుతుంటారు. ఎవ‌రికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా ఒక‌రినొక‌రు అండ‌గా ఉంటామ‌నే డైలాగులూ కామ‌న్‌గా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వినిపిస్తుంటాయి. అదంతా పైపైకి మాత్ర‌మేన‌ని, లోప‌ల మాత్రం చాలా లోసుగులు, తేడాలు ఉన్నాయ‌నే విష‌యం మ‌రోసారి రుజువైంది.

తాత బ‌యోపిక్‌ను బాబాయ్ తీస్తోంటే.. మ‌న‌వ‌డు క‌మ్ అబ్బాయ్ జూనియ‌ర్ ఎన్టీఆర్ రాలేదు. ముహూర్త‌పు షాట్‌కు డుమ్మా కొట్టాడు. నారావారి ఫ్యామిలీ స‌హా దాదాపు నంద‌మూరి కుటుంబం మొత్తం రామ‌కృష్ణ స్టూడియోకు వ‌చ్చింది. బాల‌కృష్ణ‌కు అభినంద‌న‌లు తెలిపింది. క‌ళ్యాణ్‌రామ్ కూడా అక్క‌డే ఉన్నాడు. జూనియ‌ర్ మాత్రం క‌నిపించ‌లేదు.

అదేమ‌ని అడిగితే.. త్రివిక్ర‌మ్ సినిమా కోసం జూనియ‌ర్ ఎన్టీఆర్ డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నార‌ని, దీనికోసం మేకోవ‌ర్ చేస్తున్నార‌ని, ఆ గెట‌ప్ బ‌య‌ట క‌నిపిస్తే సినిమాపై బ‌జ్ త‌గ్గిపోతుంద‌ని హిత‌బోధ చేసింది నంద‌మూరి వారి ఫ్యామిలీ. అక్క‌డ‌లా చెప్పిన ఓ గంట త‌రువాత.. జూనియ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటో సోష‌ల్ మీడియాలో విడుద‌లైంది.

కార‌ణం.. ఐపీఎల్. ఐపీఎల్‌ కోసం తీస్తోన్న ఓ యాడ్ ఫిల్మ్‌లో పాల్గొన్న జూ.ఎన్టీఆర్ పాల్గొన్న పిక్ తెగ వైరల్ అయ్యింది. మ‌రి త్రివిక్ర‌మ్ సినిమా కోసం మేకోవ‌ర్ అంటూ చెప్పిన కార‌ణాలు ఉత్త‌వేన‌ని చెప్పుకోవాలి మ‌రి. అంతెందుకు- క‌ళ్యాణ్‌రామ్ `ఎమ్మెల్యే` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు ఎన్టీఆర్ వ‌స్తాడ‌ని వార్త‌లొచ్చాయి.

 

 

దీనికీ ఓ కార‌ణాన్ని రెడీ పెట్టుకున్నాడు క‌ళ్యాణ్‌రామ్‌. త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ మేకోవర్ అవుతున్నాడ‌ని, కష్టపడి ఓ న్యూలుక్ సాధించాడ‌ని, కొత్త లుక్ తో వస్తే సినిమాపై బజ్ తగ్గిపోతుందంటూ వెన‌కేసుకొచ్చాడు. అదే లుక్‌తో ఎన్టీఆర్ యాడ్ ఫిల్మ్‌లో యాక్ట్ చేస్తున్నాడు.

యాడ్ ఫిల్మ్ అంటే దాచి పెట్టుకునేది కాదు క‌దా? టీవీల్లో ఎలాగూ టెలికాస్ట్ అవుతుంది. అప్ప‌టికైనా ఎన్టీఆర్ న్యూ లుక్ జ‌నాల‌కు తెలియ‌కుండా ఉంటుందా? ఉండ‌దు. మ‌రి ఎందుకు ఈ దాప‌రికాలనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఉండ‌దు. నంద‌మూరి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయ‌నే విష‌యం దీని ద్వారా బ‌య‌ట‌ప‌డిందంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here