క‌డక్‌నాథ్ వారి పెళ్లి పిలుపు: కాలియా వెడ్స్ సుంద‌రి..ఊరు ఊరంతా క‌దిలొచ్చింది!

ఇది పెళ్లిళ్ల సీజ‌న్‌. ఏ ఊరికెళ్లినా..మేళ‌తాళాలు, మంగ‌ళ‌వాయిద్యాలు వినిపిస్తుంటాయి. కాలియా, సుంద‌రి జంట పెళ్లి క‌థ కూడా ఇలాంటిదే. అన్ని పెళ్లిళ్ల కాలియా, సుంద‌రి వివాహాన్ని కూడా స్థానికులు వైభ‌వంగా జ‌రిపించారు. వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించ‌డానికి ఊరు ఊరంతా క‌దిలి వ‌చ్చింది. కాలియా, సుంద‌రి పెళ్లికి ఆ రేంజ్ ఇంపార్టెంట్ ఉందా? అంటే ఉంది మ‌రి.

ఎందుకుంటే- కాలియా, సుంద‌రి మ‌నుషులు కారు. కోళ్లు. కోడిపుంజుకు కాలియా అని పేరు పెట్టి, కోడి పెట్ట‌కు సుంద‌రి అని సుంద‌రంగా నామ‌క‌ర‌ణం చేసి మ‌రీ పెళ్లి జ‌రిపించారు. సంగీత్ కూడా నిర్వ‌హించారు. అత్యంత అరుదైన క‌డ‌క్‌నాథ్ ర‌కానికి చెందిన కోళ్లు అవి.

నిలువెల్లా న‌ల్ల‌రంగుతో మిళ‌మిళ మెరిసిపోతూ క‌నిపించే క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌కు భ‌లే గిరాకీ ఉంది. కేజీ మాంసం వెయ్యి రూపాయ‌ల పైమాటే. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ జిల్లా హీరానార్ గ్రామంలో శ‌నివారం రాత్రి సంప్ర‌దాయ‌బద్ధంగా ఈ పెళ్లి తంతును జ‌రిపించారు పెద్ద‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here