శూర్పణఖ గా కాజల్?

శూర్పణఖ .. రామాయణంలో బాగా గుర్తున్న పేరు. లక్స్మనుడి చేతిలో అవమానం పాలై .. అన్న రావణుడితో చెప్పి సీత అపహరణకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. అసలు రామాయణం జరగడానికి ప్రత్యక్ష కారకురాలిగా మారిన శూర్పణఖ తరహా పాత్రలో నటించేందుకు అందాల చందమామ కాజల్ రెడీ అయింది ? ఇప్పటి వరకు గ్లామర్ హీరోయిన్ గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు మొదటి సారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది. రావణుడి సోదరుల నెగిటివ్ షేడ్ లో ఈ పాత్ర సాగనుందట. ఈ సినిమాలో శూర్పణఖ .. అందంగా ఉంటుందట .. కానీ గుణం మాత్రం చెడ్డదట. ఈ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు భార్గవ్.

సోసియో ఫాంటసీ నేపథ్యంలో సాగె కథతో తెరకెక్కే ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కనుందట. ఈ పాత్రలో కాజల్ నడిచేందుకు ఓకే చెప్పడంతో దర్శకుడు అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది . మరి నెగిటివ్ షేడ్ లో కాజల్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here