పాపం కమాల్ ఆర్ ఖాన్.. బ్రతికేది ఒకటి, రెండేళ్ళేనట..!

వివాదాలతో సావాసం చేసిన బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ షాకింగ్ వార్తను బయటకుపెట్టాడు. తాను అతి త్వరలో చనిపోతున్నానని అన్నాడు. అందుకు కారణం స్టమక్ క్యాన్సర్..! ప్రస్తుతం వ్యాధి తీవ్రత స్టేజ్-3లో ఉందని.. ఒకటి, రెండేళ్ల కంటే తాను ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని చెప్పాడు.


రచయిత, నిర్మాత, యాక్టర్ అయినటువంటి కమాల్ ఆర్ ఖాన్ క్రిటిక్ గా బాగా తిట్లు తిన్నాడు. తాను ఉదర క్యాన్సర్ (స్టమక్ క్యాన్సర్)తో బాధ పడుతున్నానని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వ్యాధి తీవ్రత స్టేజ్-3లో ఉందని చెప్పాడు. ఒకటి, రెండేళ్ల కంటే తాను ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని తెలిపాడు. తనపై ఎవరూ జాలి చూపించవద్దని, తనను ఓదార్చేందుకు వచ్చే ఫోన్ కాల్స్ ను స్వీకరించలేనని చెప్పాడు. తనను ఇంతకు ముందులా తిట్టేవారికి, ద్వేషించేవారికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపాడు.

అలాగే తన తీరని రెండు కోరికలు కూడా బయటపెట్టాడు. నిర్మాతగా ఒక ఏ గ్రేడ్ సినిమా తీయాలనేది ఒక కోరిక అని… అమితాబ్ తో సినిమా తీయాలని.. ఆయనతో కలసి పనిచేయాలనేది రెండో కోరిక అని చెప్పుకొచ్చాడు… ఆ రెండు కోరికలు తనతోనే చనిపోతాయని అన్నాడు. గతంలో బిగ్ బాస్ హౌస్ లో గొడవ పడి వెళ్ళిపోయిన తర్వాత కమాల్ కు మంచి పబ్లిసిటీ వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్లను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here