పరమపదించిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 83 యేళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం కంచిలోని ఆస్పత్రిలో చేరాక, ఆయన బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో కన్నుమూశారు. గతంలో విజయవాడలో పర్యటించిన సమయంలో కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధవడుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి ఆయనను కంచిలోని ఆస్పత్రికి తరలించగా, బుధవారం ఉదయం కన్నుమూశారు. 1935 సంవత్సరం జూలై 18వ తేదీన జన్మించిన జయేంద్ర సరస్వతి కంచి మఠానికి 69వ పీఠాధిపతి. ఆయన అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here