షాకింగ్ నిర్ణయం తీసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ధావన్ కాదు కెప్టెన్..!

డేవిడ్ వార్నర్ పై ఏడాది నిషేధం విధించిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ వేటలో పడింది. శిఖర్ ధావన్ కెప్టెన్ అవుతారని అందరూ భావించారు. అయితే ధావన్ కు కాకుండా విలియమ్సన్ కు కెప్టెన్ గా బాధ్యతలను అప్పజెప్పింది సన్ రైజర్స్ యాజమాన్యం. 11వ ఐపీఎల్ లో న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్ టైటిల్ ను అందిస్తాడో లేదో వేచి చూడాలి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కూడా స్టీవ్ స్మిత్ ను తీసేసి రహానేకు జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే సన్ రైజర్స్ కూడా ధావన్ కు పగ్గాలు అప్పగిస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ లో అన్ని జట్ల కెప్టెన్లు భారత ఆటగాళ్లే అయ్యేవారు. అంతేకాకుండా ఇలా అందరు కెప్టెన్లు భారతీయులే అవ్వడం తొలిసారి అయ్యేది. కానీ ఆ ఊహాగానాలకు తెరదించుతూ సన్ రైజర్స్ విలియమ్సన్ ను కెప్టెన్ గా నియమించింది. విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే..!

సన్ రైజర్స్ యాజమాన్యం తమ సోషల్ మీడియా అకౌంట్ లో కెప్టెన్ గా విలియమ్సన్ ను నియమిస్తున్నట్లు ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన విలియమ్సన్ ” సన్ రైజర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించడం భాద్యతగా అనుకుంటున్నానని.. తమ జట్టులో మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారని.. రాబోయే కఠిన పరీక్షలు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని” చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here