కపిల్ శర్మ.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..!

కపిల్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్.. బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాడు. గత ఏడాది కపిల్ శర్మకు పెద్దగా కలిసిరాలేదు. అతడికి ఆరోగ్య సమస్యలు రావడం, హీరోగా నటించిన ఫిరంగి సినిమా ఫ్లాప్ అవ్వడం, కొన్ని వివాదాల్లో ఇరుక్కుపోవడం జరిగిపోయాయి. వాటన్నిటినీ పక్కకు తోసేసి కపిల్ శర్మ మరోసారి టీవీ మీద అలరించనున్నాడు.

సోనీ టీవీలో అతడి షో అతి త్వరలో ప్రసారం కానుంది. కొద్ది రోజుల క్రితమే సోనీ యాజమాన్యంతో మంతనాలు జరిపిన కపిల్ శర్మ.. ఆ షోకు సంబంధించిన ప్రోమోతో మన ముందుకు వచ్చాడు. అయితే అందులో సునీల్ గ్రోవర్ ఉంటాడా లేదా అన్నది ఇంకా బయటకు రాలేదు. షోకు సంబంధించిన ప్రోమోలో మరోసారి తన కామెడీతో కపిల్ అలరించబోతున్నాడు.

ఇంతకూ ఆ ప్రోమోలో ఏమి ఉందంటే:
కపిల్ శర్మ ఎక్కడికో పోవాలని ఆటో స్టాండ్ వద్దకు వస్తాడు. అప్పుడు ఆటో డ్రైవర్ ఉద్యోగం లేదు సద్యోగం లేదు నేను రాను అని అంటాడు. అందుకు కపిల్ తనకు మళ్ళీ పని దొరికింది.. సోనీ టీవీ వాళ్ళు పిలిచారు అని చెబుతాడు. అప్పటికీ నమ్మని ఆటో డ్రైవర్ కు సోనీ వాళ్ళు కాల్ చేయడం చూపించగా.. ఆటోలో ఎక్కు.. ఆటోలో ఎక్కు అని ఆటో డ్రైవర్ వెంటపడుతాడు. అయితే అక్కడికి వచ్చిన బస్సును ఎక్కి కపిల్ శర్మ సోనీ టీవీ ఆఫీసుకు బయలుదేరుతాడు. ఈ ప్రోమోకు ఆడియన్స్ నుండి చాలా బాగా రెస్పాన్స్ వస్తోంది.

#KapilSharma Coming Soon…

Laut kar aaraha hai Kapil sharma Sony Entertainment Television par, kuch alag lekar. Iss baar hasi ke alaava kuch aur bhi hai jo jayega dekar. Kya, kab aur kaise? Jaanne ke liye dekhte rahiye Sony Entertainment Television.

Sony Entertainment Televisionさんの投稿 2018年2月9日(金)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here