పొద్దున క‌ళ్లు తెర‌వ‌గానే..ఇంటి పెంకుల‌పై క‌నిపించిన అంత పెద్ద కాల‌నాగును చూసి నోట‌మాట రాలేదు!

పొద్దున పొద్దున్నే దేవుణ్ని త‌ల‌చుకుంటూ, అర చేతుల‌ను నులుముకుంటూ క‌ళ్లు తెరిచిందా కుటుంబం. అదో పెంకుటిల్లు. రంధ్రం ప‌డ్డ పెంకుల సందుల్లో నుంచి క‌నిపించిందో ఓ కాల‌నాగు. క‌నీసం 15 అడుగుల పొడ‌వు ఉన్న క‌ళింగ నాగు అది. దాన్ని చూడ‌గానే.. నోట మాట రాలేదు వారికి. కొన్ని క్ష‌ణాల పాటు ఏం చేయాలో అర్థం కాని స్థితికి చేరుకున్నారు.

క్ర‌మంగా ఆ స‌ర్పం.. ఇంటి లోనికి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే బ‌య‌టికి ప‌రుగెత్తారు. స‌ర్పాల సంర‌క్ష‌కుడికి ఫోన్ చేశారు. క్ష‌ణాల్లో వాలిపోయిన ఆయ‌న ఆ పామును చాక‌చ‌క్యంగా ప‌ట్టుకుని అడ‌వుల్లో వ‌దిలివేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్‌మ‌గ‌ళూరు జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని మూడిగెరె స‌మీపంలో ఉన్న అలీఖాన్ హోర‌హ‌ట్టి గ్రామంలో ఈ క‌ళింగ నాగు క‌నిపించింది. గిరీష్ అనే వ్య‌క్తి ఆ ఇంట్లో నివ‌సిస్తున్నారు. సోమ‌వారం తెల్ల‌వారు జామున ఈ స‌ర్పం క‌నిపించిన వెంట‌నే ఆయ‌న బిత్త‌ర‌పోయారు. కుటుంబంతో స‌హా బ‌య‌టికి వెళ్లారు. అనంత‌రం స‌ర్పాల సంర‌క్ష‌కుడు న‌రేష్‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే నరేష్‌, అట‌వీశాఖ సిబ్బంది గిరీష్ ఇంటికి వ‌చ్చారు. ఆ పామును చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంత‌మైన చార్మ‌డి ఘాట్ సెక్ష‌న్‌లో దాన్ని వ‌దిలివేశారు. ఈ పామును ప‌ట్టుకోవ‌డానికి మూడు గంట‌ల పాటు శ్ర‌మించాల్సి వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here