ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 64 శాతం పోలింగ్‌ నమోదయిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలోని రామనగర్‌ జిల్లాలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ నమోదుకాగా, బెంగళూరు పట్టణంలో అత్యల్పంగా 44 శాతం నమోదైంది. ఈ పోలింగ్‌కు సంబంధించి ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఈ ఎన్నికలు మొత్తం 222 స్థానాలకు జరిగాయి. కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. జేడీఎస్‌ ఈ ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌ అవుతుంది. మే 15న కర్ణాటక భవితవ్యం తేలనుంది.

పలు సంస్థలు విడుదల చేసిన సర్వే వివరాలు ఇవే..

టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌:
కాంగ్రెస్: 90-103
బీజేపీ: 80-93
జేడీఎస్‌: 31-39
ఇతరులు: 2-4

ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా:
కాంగ్రెస్: 106-118
బీజేపీ: 79-92
జేడీఎస్‌: 22-30
ఇతరులు: 1-4

రిపబ్లిక్‌ టీవీ- జన్‌ కీ బాత్‌:
కాంగ్రెస్: 73-82
బీజేపీ: 95-114
జేడీఎస్‌: 32-43
ఇతరులు: 2-3

ప్రజాన్యూస్‌:
కాంగ్రెస్: 72-78
బీజేపీ: 102-110
జేడీఎస్‌: 35-39
ఇతరులు: 0-5

న్యూస్‌ నేషన్‌:
కాంగ్రెస్: 71-75
బీజేపీ: 105-109
జేడీఎస్‌: 36-40
ఇతరులు: 3-5

ఏబీపీ:
కాంగ్రెస్: 87-99
బీజేపీ: 97-109
జేడీఎస్‌: 21-30
ఇతరులు: 1-8

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here