న‌డ‌వ‌లేద‌ని సోద‌రిని నరికి చంపాడు..!

విక‌లాంగురాలైన తోడ‌బుట్టిన సోద‌రిని న‌రికి చంపాడో వ్య‌క్తి. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలో చోటు చేసుకుంది. హ‌తురాలి పేరు జ్యోతి మ‌హదేవ నాయ‌క్‌. ఆమెను సొంత త‌మ్ముడు స‌తీష్ మ‌హ‌దేవ నాయ‌క్ హ‌త‌మార్చాడు.

జిల్లాలోని హొన్నావ‌ర తాలూకా మంకిక‌చ్చోడియా గ్రామానికి చెందిన జ్యోతి పుట్టుక‌తోనే విక‌లాంగురాలు. వారిది నిరుపేద కుటుంబం. జ్యోతికి త‌ల్లి, ఇద్ద‌రు సోద‌రులు ఉన్నారు. ఇద్ద‌రు సోద‌రులూ వివాహితులే.

ఆదివారం రాత్రి ఇంటి బ‌య‌ట ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో జ్యోతిపై దాడి చేశాడు. క‌త్తితో ఆమె గొంతుకోసి హ‌త‌మార్చాడు. దీనితో సంఘ‌ట‌నాస్థ‌లంలోనే ఆమె మ‌ర‌ణించారు.

అదే స‌మ‌యంలో ఇంటికి వ‌చ్చిన స‌తీష్ సోద‌రుడు రోహిత్..పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స‌తీష్‌ను అరెస్టు చేశారు.

మంకీ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. జ్యోతిని పోషించే భారం మోయ‌లేనందునే తాను ఈ హ‌త్య చేసిన‌ట్టు స‌తీష్ అంగీక‌రించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here