కొలువుదీరిన క‌ర్ణాట‌క మంత్రివ‌ర్గం!

కర్ణాటక నూతన మంత్రివర్గం కొలువుతీరింది. 25 మందితో ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి 15, జేడీఎస్ 9, బీఎస్పీ నుంచి ఒక ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారు.. హెచ్‌డీ రేవణ్ణ, ఆర్‌వీ దేశ్‌పాండే, బండెప్ప కాశంపూర్, డీకే శివకుమార్, కేజే జార్జ్, డీసీ తమ్మణ్ణ, కృష్ణ భైరెగౌడ, మనగూళి మల్లప్ప, ఎన్‌హెచ్ శివశంకర్‌రెడ్డి, ఎస్‌ఆర్ శ్రీనివాస్, ప్రియాంక్ ఖర్గే, సీఎస్ పుత్తరాజు, యూటీ అబ్దుల్ ఖాదర్, బీ.జడ్. జమీర్ అహ్మద్ ఖాన్, ఎన్ మహేశ్, శివానంద్ పాటిల్, ఆర్ శంకర్, జ‌య‌మాల. హోం, నీటిపారుదల, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలతో పాటు పలు శాఖలు కాంగ్రెస్‌కు దక్కాయి.

ఆర్థిక శాఖ, ఎక్సైజ్, ప్రజా వ్యవహారాలు, విద్యా, పర్యాటక శాఖతో పాటు రవాణా శాఖ పదవులు జేడీఎస్‌కు దక్కాయి. వారిలో హెచ్‌డీ రేవ‌ణ్ణ స్వ‌యానా ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి సోద‌రుడు. యూటీ అబ్దుల్ ఖాదర్, ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్‌, డీకే శివ‌కుమార్‌, కృష్ణ బైరెగౌడ గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోనూ మంత్రులుగా ప‌నిచేశారు.

చాముండేశ్వ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో సాక్షాత్తూ మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌ను ఓడించిన జీటీ దేవెగౌడ‌ను కూడా మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. జ‌య‌మాల సినీ న‌టి. ఆమె ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ఎన్ మ‌హేష్ అంబేద్క‌ర్ త‌ర‌హా వ‌స్త్ర‌ధార‌ణ‌తో ప్ర‌మాణ స్వీకారం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here