రెండు నెల‌ల కింద‌టే వైభ‌వంగా వివాహం! ఎవ‌రి దిష్టి త‌గిలిందో గానీ..గుడికెళ్లి వ‌స్తుండ‌గా!

రెండు నెల‌ల కింద‌ట వారిద్ద‌రూ దంప‌తుల‌య్యారు. పెళ్లి క‌ళ ఇంకా చెదిరి పోలేదు. కాళ్ల పారాణి ఇంకా ఆరిపోనూ లేదు. అప్పుడే ఆ ఇద్ద‌రి జీవితాలూ చీక‌ట్లో క‌లిసిపోయాయి. ఓ రోడ్డు ప్ర‌మాదం ఆ న‌వ దంప‌తుల‌ను క‌బ‌ళించి వేసింది. వారు వెళ్తోన్న బైక్‌ను అదుపు త‌ప్పిన కారొక‌టి ఢీ కొట్టింది.

ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రూ సంఘ‌ట‌నాస్థ‌లంలోనే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ విషాద‌కర ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌వేరి జిల్లాలో చోటు చేసుకుంది.

మృతుల పేర్లు మ‌ల్ల‌య్య భ‌జ్జి, జ్యోతి భ‌జ్జి. జిల్లాలోని రాణిబెన్నూరుకు చెందిన మ‌ల్ల‌య్య‌, జ్యోతి బైక్‌పై క‌ద‌ర‌మండ‌ల గ్రామంలోని దేవ‌స్థానానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండ‌గా బెంగ‌ళూరు-పుణే జాతీయ ర‌హ‌దారిపై స్విఫ్ట్ కారు వేగంగా ఢీ కొట్టింది.

ఈ ఘ‌ట‌న‌లో మ‌ల్ల‌య్య‌, జ్యోతి సంఘ‌ట‌నాస్థ‌లంలోనే మృత్యువాత ప‌డ్డారు. బైక్ నుజ్జునుజ్జ‌యింది. ఈ ప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే డ్రైవ‌ర్ పారిపోయాడు. స్థానికులు కారును ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై రాణిబెన్నూరు రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here