ముందు అది! ఆ త‌రువాతే పెళ్లి!

పెళ్లి దుస్తుల్లో ధ‌గ‌ధ‌గ‌మంటూ మెరిసిపోతున్న ఈ అమ్మాయి పేరు వియోలా మ‌రియా ఫెర్నాండెజ్‌. నిజానికి చ‌ర్చిలో క‌నిపించాలి. దీనికి భిన్నంగా ఆమె ఓ పోలింగ్ బూత్‌లో క‌నిపించారు. పెళ్లి ముహూర్తం దాటి పోతున్న‌ప్ప‌టికీ.. ప‌ట్టించుకోలేదు. పోలింగ్ బూత్‌తో క్యూలో నిల్చుని త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరు బేల్తంగ‌డిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

వియోలా పెళ్లి శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల‌కు సిల్వెస్ట‌ర్ రోడ్రిగ్స్ అనే యువ‌కుడితో జ‌ర‌గాల్సి ఉంది. దీనికోసం ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. స‌మ‌యానికి వియోలా చ‌ర్చికి రాలేదు. ఆ స‌మ‌యానికి ఆమె త‌న బంధ‌వులతో క‌లిసి ఆమె నేరుగా మంగ‌ళూరులోని సెయింట్ లారెన్స్ మీడియం స్కూల్‌లో ఏర్పాటు చేసిన‌ పోలింగ్ బూత్‌కు వెళ్లారు. క్యూలో నిల్చుని ఓటు వేశారు. అనంత‌రం- చ‌ర్చికి వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here