ఒకే స‌మ‌యంలో ఇద్ద‌ర్ని ప్రేమించాడు! అది వారి ఇళ్ల‌ల్లో తెలిసే స‌రికి!

బ‌ళ్లారి: ఒకే స‌మయంలో ఇద్ద‌రు యువతుల‌ను ప్రేమించాడో ఇంజినీరింగ్ విద్యార్థి. వారిద్ద‌ర్నీ మేనేజ్ చేయ‌లేక స‌త‌మ‌త‌మ‌య్యాడు. ఇద్ద‌రి నుంచీ వ‌స్తోన్న ఒత్తిళ్లు భ‌రించ‌లేక‌.. ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మ‌నుకున్నాడు. చెరువులో దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారిలో చోటు చేసుకుంది. మృతుడి పేరు ఆకాశ్‌.

గంగావ‌తి ప‌ట్ట‌ణానికి చెందిన ఆకాశ్ బ‌ళ్లారిలోని బీఐటీఎం ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చ‌దువుతున్నాడు. ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రిని ప్రేమించాడు. ఈ విష‌యం ఆ ఇద్ద‌రు యువతులతో పాటు వారి ఇంట్లో వారికీ తెలిసింది. దీనితో అత‌నికి బెదిరింపులు ఎక్కువ‌య్యాయి. హ‌త్య చేస్తామంటూ ఫోన్ చేసి మ‌రీ హెచ్చ‌రిస్తుండేవారు.

ఈ బెదిరింపులను త‌ట్టుకోలేక‌.. బీఐటీఎం కాలేజీ స‌మీపంలోని అల్లిపుర చెరువులో దూకి, ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై ఆకాశ్ త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్నారు బ‌ళ్లారి రూర‌ల్ పోలీసులు. పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక అందిన త‌రువాతే ఆకాశ్ హ‌త్య వెనుక గ‌ల కార‌ణాలు తెలుస్తాయ‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here