3 నిమిషాల వ్య‌వ‌ధిలో చూస్తుండ‌గానే నూటొక్క గుడ్లు! అవి గాని పొదిగి ఉంటేనా!

మూడంటే మూడే నిమిషాలు. ఈ కాస్త వ్య‌వ‌ధిలోనే ఆ పాము 101 గుడ్ల‌ను పెట్టింది. అరుదైన కీల్‌బ్యాక్ జాతికి చెందిన పాము అది. క‌ర్ణాట‌క‌లోని చామ‌రాజ న‌గ‌ర జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌.

జిల్లాలోని గుండ్లుపేటె తాలూకా ప‌రిధిలోని సోమ‌హ‌ళ్లిలో క‌నిపించింది ఈ పాము. ఇదే గ్రామానికి చెందిన మ‌హ‌దేవ‌ప్ప ఇంట్లో మూడు నిమిషాల వ్య‌వ‌ధిలో 101 గుడ్ల‌ను పెట్టింది. పామును, అది పెట్టిన గుడ్ల‌ను చూడ‌గానే పైప్రాణాలు పైనే పోయాయి.

వెంట‌నే ఆయ‌న పాముల సంర‌క్ష‌కుడు స్నేక్ మ‌హేష్‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే మ‌హ‌దేవ‌ప్ప ఇంటికి వ‌చ్చిన ఆయ‌న పాము, గుడ్ల‌ను సంర‌క్షించారు.

అంత త‌క్కువ వ్య‌వ‌ధిలో ఇన్ని గుడ్ల‌ను పెట్టింద‌నే విష‌యం తెలుసుకుని ఆయ‌న కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. కీల్‌బ్యాక్ జాతికి చెందిన పాము 50 గుడ్ల‌కు పైగా పెడుతుంద‌ని, దాని కోసం క‌నీసం రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు. ఆ గుడ్లు పొద‌గ‌డానికి క‌నీసం 70 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here