రాజకీయాలు మరీ కాస్ట్లీ అంటే నమ్మలేదు.. కర్ణాటక ఎమ్మెల్యేల ఒక్కరోజు హోటల్ ఖర్చు ఎంతంటే..!

దేశంలో రాజకీయాలు ముందు లాగా లేవు.. ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయాయి. సీట్లు కాపాడుకోవడానికి.. తమ నేతలను అట్టి పెట్టుకోడానికి ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో అదే పరిస్థితి నెలకొంది. ఎంతో కష్టపడితే కానీ తమ నేతలను కాపాడులేకపోతున్నారు జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. కష్టమే కాదు.. ఖర్చు కూడా చాలానే ఉందని బాధపడిపోతున్నారు. కర్ణాటక నుండి వాళ్ళను హైదరాబాద్ కు తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే.. వాళ్ళ ఒక్క రోజు హోటల్ ఖర్చు గురించి తెలిస్తే మనం షాక్ తినడం గ్యారెంటీ..!

నోవాటెల్‌లో జేడీఎస్, తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు నోవాటెల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బస చేసినందుకు గాను 19 లక్షల రూపాయల బిల్లు కాగా, జేడీఎస్ ప్రతినిధులు దానిని చెల్లించారు. ఇక తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపినందుకు గాను 26 లక్షల రూపాయల బిల్లు అయినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ క్యాంపునకు మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. కర్ణాటక అసెంబ్లీలో నేడు బలనిరూపణ ఉండడంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్‌లోని హోటళ్లకు తరలించింది. ఈరోజు సాయంత్రానికి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో తెలిసిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here