యువ‌తి సెల్‌ఫోన్‌లో మునిగిపోయింద‌నుకుని ఆటోను దారి మ‌ళ్లించాడు..చిన్న లాజిక్ మిస్స‌య్యాడు!

ఎప్పుడూ సెల్‌ఫోన్ చేత్తో ప‌ట్టుకుని, అదే లోక‌మ‌ని జీవించే యువ‌త‌కు క‌నువిప్పు క‌లిగించే ఘ‌ట‌న ఇది. ఆటో ఎక్క‌గానే ఫేస్‌బుక్ చూసుకుంటూ, వాట్స‌ప్‌లో ఛాట్ చేస్తూ అందులో మునిగిపోయింది ఓ యువ‌తి. దీన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు స‌ద‌రు ఆటో డ్రైవ‌ర్‌. ఆమె చెప్పిన మార్గంలో కాకుండా.. ఆటోను దారి మ‌ళ్లించాడు.

నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్లాడు. యువ‌తిపై అత్యాచార య‌త్నానికి పాల్ప‌డ్డాడు. అప్ప‌టికి గానీ ఆ యువ‌తి సెల్‌ఫోన్‌లో నుంచి బ‌య‌టికి రాలేదు. ఆటోడ్రైవ‌ర్ చ‌ర్య‌ల‌తో ఈ లోకంలో వ‌చ్చిప‌డ్డ ఆ యువ‌తి బిగ్గ‌ర‌గా కేక‌లు వేసింది. దీనితో పొలాల్లో ప‌ని చేసుకుంటున్న రైతులు, కూలీలు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆటోడ్రైవ‌ర్‌ను అడ్డుకున్నారు.

అత‌నికి దేహ‌శుద్ధి చేశారు. క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరె శివార్ల‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. ఆటోడ్రైవ‌ర్ పేరు మంజునాథ్‌. న‌గ‌ర శివార్లలోని ఓ గ్రామం నుంచి దావ‌ణ‌గెరెలో బైపాస్ రోడ్డు మీదుగా ప్ర‌వేశించాల్సిన ఆటోను దారి మ‌ళ్లించాడు మంజునాథ్‌. నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్లి, ఆటోలోని యువ‌తిపై అత్యాచార య‌త్నానికి ఒడిగ‌ట్టాడు. అదే స‌మ‌యంలో- ఆమె వేసిన కేక‌లు విని, పొలాల్లో ప‌నిచేస్తున్న రైతులు అత‌ణ్ని అడ్డుకున్నారు. దేహ‌శుద్ధి చేశారు. ఈ ఘ‌ట‌నపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here