ప‌బ్‌లో కీచ‌క‌త్వం..! ఫ్రెండ్‌తో క‌లిసి ఓ యువ‌తిపై..!

మైసూరు: అస‌లే ప‌బ్‌. తాగిన మ‌త్తులో తానేం చేస్తున్నాడో తెలియ‌ని ప‌రిస్థితి. అందంగా క‌నిపించిన యువ‌తిపై క‌న్నేశాడా కీచ‌కుడు. త‌న స్నేహితుడితో క‌లిసి ఆమెను వేధించాడు. లైంగిక దాడికి ప్ర‌య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మైసూరులో చోటు చేసుకుంది. ఉమేష్‌కుమార్ అనే యువ‌కుడు త‌న స్నేహితుడు వివేక్‌తో క‌లిసి ఆదివారం సాయంత్రం మైసూరు పంచ‌వ‌టి స‌ర్కిల్‌లోని లాస్ట్ అండ్ ఫౌండ్ ప‌బ్‌కు వెళ్లాడు.

ఇద్ద‌రూ క‌లిసి పీక‌ల్దాకా తాగారు. మ‌ద్యం మ‌త్తులో ఓ యువ‌తిపై లైంగిక దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారు. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో ఆమెను కొట్టారు. వారి దెబ్బ‌ల‌కు ఆ యువ‌తిపై ముఖంపై గాయాల‌య్యాయి. ప‌బ్‌లో నానా హంగామా సృష్టించారు. అనంత‌రం ఆమె జ‌య‌ల‌క్ష్మీపురం పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here