కొబ్బ‌రి ముక్క గొంతులో ఇరుక్కుని మ‌హిళ మృతి

కొబ్బ‌రి ముక్క గొంతులో ఇరుక్కుని ఓ మ‌హిళ మృతి చెందిన ఘ‌ట‌న ఇది. క‌ర్ణాట‌క‌లోని చిక్‌మ‌గ‌ళూరులో చోటు చేసుకుంది. మృతురాలి పేరు న‌వ్య‌శ్రీ‌. 28 సంవ‌త్స‌రాల న‌వ్య‌శ్రీ‌కి భ‌ర్త‌, 10 నెల‌ల కుమార్తె ఉన్నారు. న‌వ్య‌శ్రీ ఉపాధ్యాయురాలు.

చిక్‌మ‌గ‌ళూరులోని సంజీవిని స్కూల్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. రెండో శ‌నివారం అయిన‌ప్ప‌టికీ.. స్కూలుకు సెల‌వు ఇవ్వ‌లేదు. రోజూలాగే శ‌నివారం ఉద‌యం స్కూల్‌కు వెళ్లారు.

ఆ స‌మ‌యంలో ఖాళీ స‌మ‌యం ల‌భించ‌డంతో తోటి ఉపాధ్య‌యినిల‌తో క‌లిసి ద‌గ్గ‌ర్లో ఉన్న సాలు మ‌రుద‌మ్మ గుడికి వెళ్లారు. అక్క‌డి శ‌ని దేవుడి విగ్ర‌హానికి పూజ‌లు చేశారు. కొబ్బ‌రికాయ కొట్టారు. తిరిగి స్కూల్‌కు చేరుకున్నారు.

కొబ్బ‌రి చిప్ప‌ను ప‌గులుగొట్టి ముక్క‌ల‌ను తింటుండ‌గా.. ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. అన్న‌వాహిక‌కు అడ్డుప‌డింది. దీనితో ఆమె ఊపిరి పీల్చుకోలేక‌పోయారు. తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు.

ఆమె ప‌రిస్థితిని గ‌మ‌నించిన తోటి ఉపాధ్యాయులు ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. ఊపిరి అడ‌క మార్గ‌మ‌ధ్య‌లోనే మ‌ర‌ణించారు. హ‌ఠాత్తుగా న‌వ్య‌శ్రీ మ‌ర‌ణంతో ఆమె కుటుంబంలో విషాదం నెల‌కొంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here