పోలీస్‌స్టేష‌న్‌లోనే జుట్టు, జుట్టూ ప‌ట్టుకున్నారు..పోలీసుల‌నూ ప‌క్క‌కు తోసేశారు!

చిత్ర‌దుర్గ: కొంద‌రు హిజ్రాలు గ్రూపులుగా ఏర్ప‌డి పోలీస్‌స్టేష‌న్‌లోనే ప‌ర‌స్పరం దాడికి దిగిన ఘ‌ట‌న ఇది. వారిని అడ్డుకోబోయిన పోలీసుల‌ను కూడా వారు ఖాత‌రు చేయ‌లేదు. పోలీసుల‌నూ పక్క‌కు తోసేసి మ‌రీ కొట్టుకున్నారు. జుట్టు, జుట్టు ప‌ట్టుకుని తోసుకున్నారు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిత్ర‌దుర్గ పోలీస్‌స్టేష‌న్‌లో చోటు చేసుకుంది. వారు ఇలా కొట్టుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. పంప‌కాల్లో తేడా రావ‌డం, లోక‌ల్‌-నాన్ లోక‌ల్ స‌మ‌స్య త‌లెత్త‌డం.

కొద్దిరోజుల కింద‌ట బెంగ‌ళూరు, చామ‌రాజ న‌గ‌ర జిల్లాల‌కు చెందిన కొంద‌రు హిజ్రాలు చిత్ర‌దుర్గ‌కు వెళ్లారు. అక్క‌డే తిష్ట వేవారు. ఈ విష‌యంలో చిత్ర‌దుర్గ‌కు చెందిన హిజ్రాలు వారితో గొడ‌వ ప‌డ్డారు.

త‌మ స‌రిహ‌ద్దుల్లోకి ఎందుకు ప్ర‌వేశించారంటూ ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ.. వారి రోజువారి కార్య‌క‌లాపాలు య‌థాత‌థంగా కొన‌సాగాయి.

బిచ్చం ఎత్తుకోగా వ‌చ్చిన డ‌బ్బుల్లో కొంత వాటా ఇచ్చేలా చిత్ర‌దుర్గ‌కు చెందిన హిజ్రాల‌తో బెంగ‌ళూరు, చామ‌రాజ న‌గ‌ర నుంచి గ్రూపులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ పంప‌కాల్లో తేడా రావ‌డంతో రెండు గ్రూపులూ ఘ‌ర్ష‌ణ‌కు దిగారు.

రెండు గ్రూపుల మ‌ధ్యా రాజీ కుదిర్చ‌డానికి పోలీసులు వారిని స్టేష‌న్‌కు పిలిపించారు. అక్క‌డే తేడా కొట్టేసింది. పోలీస్‌స్టేష‌న్‌లో.. పోలీసుల స‌మ‌క్షంలో బాహాబాహికి దిగారు హిజ్రాలు. కొట్టుకున్నారు. తోసుకున్నారు.

వారించ‌డానికి వ‌చ్చిన పోలీసుల‌నూ లెక్క‌చేయ‌లేదు. వారిని ప‌క్కకు తోసి మ‌రీ కొట్టుకున్నారు. చివ‌రికి- రెండు గ్రూపుల‌ను పోలీసులు అరెస్టు చేసి, లాక‌ప్‌లో ప‌డేస్తే గానీ గొడ‌వ చ‌ల్లార‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here