అదుపు త‌ప్పితే..అంతే సంగ‌తులు! బెట్టింగ్ పెట్టుకుని బైక్ వీలింగ్..అదీ జాతీయ ర‌హ‌దారిపై!

బైక్‌ను బ్యాక్ టైర్‌పై మాత్ర‌మే ప‌రుగెత్తిస్తూ బైక‌ర్లు చేసే సాహ‌స విన్యాసాలు సాధార‌ణంగా ర‌ద్దీ లేని ప్రాంతాల్లోనో, ట్రాఫిక్ పెద్ద‌గా లేని ర‌హ‌దారుల మీద‌నో చూస్తుంటాం. ఇక్క‌డ మాత్రం ఒక‌రిద్ద‌రు బైక‌ర్లు.. ఇలా జాతీయ ర‌హ‌దారిపై వీలింగ్ చేస్తూ క‌నిపించారు.

ఒక‌ట్రెండు కిలోమీట‌ర్లు కాదు.. సుమారు 10-15 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ వారి విన్యాసాల‌కు అడ్డు లేకుండా పోయింది. బెట్టింగ్ పెట్టుకుని మ‌రీ ఇలా వీలింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప‌బ్లిక్ టీవీ ప్ర‌సారం చేసింది.

బెంగ‌ళూరు-తుమ‌కూరు నాలుగో నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ విన్యాసాల‌ను చూసిన ఇత‌ర వాహ‌న‌దారులు భయాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. వారొచ్చి త‌మ వాహ‌నాల ఎక్క‌డ ప‌డ‌తారోన‌ని ఆందోళ‌న చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here