ఉద‌యం ప‌క్కింటి వాళ్ల‌తో కొట్లాట‌..మ‌ధ్యాహ్నానికి రెండేళ్ల బాబు అదృశ్యం..సాయంత్రానికి!

ఇరుగుపొరుగున ఉండే రెండు కుటుంబాల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ రెండేళ్ల పిల్ల‌వాడి ఉసురు తీసింది. ఉద‌యం 11 గంట‌లకు గొడ‌వ చోటు చేసుకుంటే.. మ‌ధ్యాహ్నం నుంచి ఆ బాబు అదృశ్యం అయ్యాడు. సాయంత్రానికి ఊరి చివ‌ర్లో ఉన్న జామాయిల్ చెట్ల తోపులో మృత‌దేహంగా క‌నిపించాడు.

ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న బెంగ‌ళూరు శివార్లలోని సోల‌దేవ‌న హ‌ళ్లిలో చోటు చేసుకుంది. ఆ చిన్నారి పేరు వెంక‌టేష్‌. సోల‌దేవ‌న హ‌ళ్లికి చెందిన బ‌స‌వ‌రాజు, వెంక‌మ్మ దంప‌తుల కుమారుడు. రెండురోజులుగా పొరుగింట్లో ఉండే ఈర‌ణ్ణ కుటుంబం, బ‌స‌వ‌రాజు కుటుంబం మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకున్నాయి.

బుధ‌వారం ఉద‌యం కూడా ఈర‌ణ్ణ‌, బ‌స‌వ‌రాజు ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. అదేరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి వెంక‌టేష్ క‌నిపించ‌కుండా పోయాడు. బాబు కోసం బ‌స‌వ‌రాజు గాలిస్తుండ‌గానే.. సోమ‌దేవ‌న హ‌ళ్లికి మూడుకిలోమీట‌ర్ల దూరంలో ఉన్న జామాయిల్ చెట్ల తోపులో వెంక‌టేష్ మృత‌దేహం క‌నిపించింది.

దీనితో బ‌స‌వ‌రాజు, వెంక‌మ్మ‌ల విషాదానాకి అంతు లేకుండా పోయింది. వెంట‌నే వారు సోమ‌దేవ‌న హ‌ళ్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గొంతు నులిమి హ‌త‌మార్చిన‌ట్లు ఆన‌వాళ్లు ఉన్నాయ‌ని పోలీసులు తెలిపారు. దీనికి ఈర‌ణ్ణే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. పోలీసులు అత‌ణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here