భార్య‌తో చేయ‌రాని ప‌నులు! త‌ప్ప తాగ‌డానికి అదే అత‌నికి ఆదాయం! ఒప్పుకోనందుకు దారుణం!

భార్య‌తో చేయ‌రాని ప‌నులు చేయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఓ కిరాత‌క భ‌ర్త‌ను పోలీసులు అరెస్టు చేశారు. క‌ర్ణాట‌క‌లోని మైసూరు జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

జిల్లాలోని నంజ‌న‌గూడు తాలూకా ప‌రిధిలోని ఎచ‌గుడ్ల గ్రామానికి చెందిన అయ్య‌ప్పకు ఆరేళ్ల కింద‌ట ర‌త్నమ్మ అనే యువ‌తితో పెళ్ల‌యింది. వారికి ఓ బిడ్డ పుట్టాడు.

చిరు వ్యాపారం చేసుకునే అయ్య‌ప్ప మ‌ద్యానికి బానిస అయ్యాడు. త‌న‌కు వ‌చ్చే ఆదాయం కుటుంబ పోష‌ణ‌కే స‌రిపోవ‌ట్లేద‌ని భావించిన అయ్య‌ప్ప‌.. కొత్త ఎత్తుగ‌డ వేశాడు.

ప‌రాయి వ్య‌క్తుల‌తో చ‌నువుగా మాట్లాడాల‌ని, వారి నుంచి డ‌బ్బులు గుంజాల‌ని ఆదేశించాడు. దాన్ని వీడియో తీసి.. ఆ అప‌రిచిత వ్య‌క్తుల‌కు చూపించి, డ‌బ్బులు గుంజాల‌నేది అత‌ని ప్లాన్‌.

దీనికి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ర‌త్న‌మ్మ‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తుండేవాడు. రోజూ కొట్టేవాడు. దీనితో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. భ‌ర్త వేధింపుల నుంచి త‌న‌ను కాపాడాలంటూ ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here