వివాహేత‌ర సంబంధం: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు..!

వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తున్న మాజీ ప్రేమికుల‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న ఘ‌ట‌న ఇది. క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావి జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని ఇండి తాలూకా గుడ్యాళ గ్రామానికి చెందిన యువ‌తికి అదే గ్రామానికి చెందిన విఠ‌ల సంగ‌ప్ప గౌడ అనే యువ‌కుడిని ప్రేమించింది. ఇద్ద‌రి కులాలు వేర్వేరు కావ‌డంతో ఈ పెళ్లికి ఇంట్లో వాళ్లు అంగీక‌రించ‌లేదు.

ఆరునెల‌ల కింద‌ట అదే జిల్లాలోని అథ‌ణి తాలూకా కొట్టెల‌గి గ్రామానికి చెందిన వేరే యువ‌కుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లయిన త‌రువాత కూడా ఆమె త‌న ప్రియుడిని మ‌రిచిపోలేక‌పోయింది.

దీనితో.. భ‌ర్త ఊళ్లో లేని స‌మ‌యంలో ఆమె సంగ‌ప్ప గౌడ‌కు ఫోన్ చేసి, పిలిపించుకునేది. ఆదివారం భ‌ర్త బెళ‌గావికి వెళ్లాడు. దీనితో ఆమె సంగ‌ప్ప‌ను ఇంటికి పిలిపించుకుంది.

గ్రామ‌స్తుల‌కు ఈ విష‌యం తెలియ‌డంతో, ఇద్ద‌ర్నీ రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని చెట్టుకు క‌ట్టేశారు. ఐగ‌ళి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై ఐగ‌ళి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here