వివాహేత‌ర‌ సంబంధానికి అడ్డొస్తున్నాడ‌ని..భ‌ర్త‌ను లేపేసింది! మృత‌దేహాన్ని మంచంపై ఉంచి..!

బెంగ‌ళూరులో మ‌రో నాగ‌ర్‌క‌ర్నూల్ త‌ర‌హా ఘ‌ట‌న‌. త‌న వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌నే ఉద్దేశంతో క‌ట్టుకున్న భ‌ర్త‌ను లేపేసిందో మ‌హిళ‌. త‌న ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త‌మార్చింది. చివ‌రికి.. పోలీసుల చేతికి చిక్క‌నే చిక్కింది.

ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులోని హుళిమావు పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. హ‌తుడి పేరు మ‌హేష్ శింధె. త‌న భార్య దీపాలి, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి హుళిమావులో నివ‌సిస్తున్నాడు. ఆమెకు రాజ్‌కుమార్ అనే యువ‌కుడితో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది.

మ‌హేష్ శింధె ఆటోడ్రైవ‌ర్‌. దీపాలి స్థానికంగా ఓ గార్మెంట్స్ షాప్‌లో ప‌నిచేస్తుండేది. అదే గార్మెంట్స్ షాపులో రాజ్‌కుమార్ కూడా ప‌నిచేస్తున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్యా వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. మ‌హేష్ ఇంట్లో లేని స‌మ‌యంలో రాజ్‌కుమార్ త‌ర‌చూ దిపాలి ఇంటికి వెళ్లేవాడు.

ఈ నెల 8వ తేదీన సాయంత్రం 7 గంట‌లకు రాజ్‌కుమార్ ఆమె ఇంటికి వెళ్లాడు. అనూహ్యంగా మ‌హేష్.. 7:30 గంట‌ల‌కు ఇంటికెళ్లాడు. అత‌ణ్ణి చూసిన రాజ్‌కుమార్ మంచం కింద దాక్కున్నాడు. ఇంట్లోకి వ‌చ్చిన మ‌హేష్ భార్య ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల అనుమానం క‌లిగింది. భార్య‌ను అత‌ను నిలదీశాడు.

మొద‌ట బుకాయించింది. అన‌వ‌స‌రంగా అనుమానిస్తున్నాంటూ గొడ‌వ పెట్టుకుంది. మ‌హేష్‌ బెడ్‌రూమ్ అంతా వెదికాడు. మంచం కింద దాక్కున్న రాజ్‌కుమార్‌ను ప‌ట్టుకున్నాడు. దీనితో ఇద్ద‌రూ క‌లిసి మ‌హేష్ గొంతు నులిమి హ‌త‌మార్చారు.

కొద్దిసేప‌టికి ఇద్దరు పిల్ల‌లు ట్యూష‌న్ నుంచి ఇంటికి వ‌చ్చారు. వారిని చూసి, కంగారుప‌డ్డ దీపాలి భ‌ర్త మృత‌దేహాన్ని మంచంపై ఉంచింది. ఆరోగ్యం బాగోలేక నిద్ర‌పోతున్నాడ‌ని, ద‌గ్గ‌రికి వెళ్లొద్దంటూ పిల్ల‌ల‌ను హెచ్చ‌రించింది. కొద్దిసేప‌టి త‌రువాత భ‌ర్త మ‌ర‌ణించిన‌ట్లు నాటకం ఆడింది.

అనుమానాస్ప‌దంగా మ‌ర‌ణించాడంటూ హుళిమావు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు కూడా చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మ‌హేష్‌ను హ‌త్య‌చేశారంటూ పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక‌లో తేల‌డంతో..మొద‌టి అనుమానం దీపాలిపైనే వెళ్లింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. అసలు విష‌యాన్ని వెల్ల‌డించింది. దీపాలి, రాజ్‌కుమార్‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here