చివరికి ఆ సినిమా పాటలకు డ్యాన్సులు వేసినా దాడులా.. చిన్నపిల్లలయ్యా..!

ఇప్పటివరకూ పద్మావతి సినిమా మీద చెలరేగుతున్న వివాదాలు అలాంటివి.. ఇలాంటివి కావు.. ఇప్పటికే సినిమాను అడ్డుకోవాలని పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తాజాగా మరో అంశం బయటకు వచ్చింది. అదేంటంటే చివరికి ఆ సినిమాలోని పాటలకు డ్యాన్సులు వేసినా దాడులు చేస్తారట. నిజంగా జరిగింది ఈ ఘటన. చిన్నపిల్లలు పద్మావతి సినిమా లోని ‘ఘూమార్’ పాటలకు డ్యాన్సులు వేశారు. అంతే కోపగించుకున్న కొందరు ఆ స్కూలుపై దాడి చేసి.. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. చిన్న పిల్లలు చేసిన డ్యాన్స్ కు స్కూల్ కు నష్టం కలిగించారు. మ‌ధ్య ప్రదేశ్‌లోని ర‌ట్లంకు చెందిన సెయింట్ పాల్స్ కాన్వెంట్ స్కూల్‌ విద్యార్థులు వేడుకల్లో భాగంగా ఈ పాటకు స్టెప్స్ వేశారు. దీనిపై మండిప‌డ్డ క‌ర్ణిసేన‌ కార్యకర్తలు స్కూల్ ఫ‌ర్నీచ‌ర్‌ను విరగ్గొట్టారు. ఈ క్రమంలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పద్మావతి సినిమా పేరును ‘పద్మావత్’ గా మార్చారు. 2017 డిసెంబర్ 1న విడుదల కావాల్సిన ఈ సినిమా.. 2018 జనవరి 25న విడుదల కాబోతోంది. సినిమాలో పలు కట్స్ విధించారని తెలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here