పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కత్తి మహేష్..!

పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న కత్తి మహేష్ పై పలువురు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు గత కొద్దిరోజులుగా సమాధానం చెప్పలేదు కత్తి మహేష్. 15వ తేదీ వరకూ సైలెంట్ గా ఉండమని రైటర్ కోన వెంకట్ చెప్పిన సూచనను పాటించాడు. అలాగే సంక్రాంతికి ఊరు కూడా వెళ్ళారు. అయితే ఈరోజు కత్తి మహేష్ అప్పట్లో పవన్ ప్రశ్నలు సంధించిన ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు.

1. నీ తండ్రి వ్యవసాయ అధికారిగా ఎన్ని కోట్లు మింగాడు?
మ‌హేశ్ క‌త్తి సమాధానం: ఆయ‌న రిటైర్ మెంటుతో వ‌చ్చిన డ‌బ్బుల‌తో మా ఊరిలో, మాకు ఉన్న స్థ‌లంలో చిన్న ఇల్లు క‌ట్టుకుని ఉంటున్నారు. కోట్లు ఉన్నాయ‌నేది ఫ్యాన్స్ ఊహించుకుని ఆరోపణ‌లు చేస్తున్నారు. నేను ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నాన‌ని, హుందాగా క‌న‌ప‌డుతున్నాన‌ని ప‌వ‌న్‌ ఫ్యాన్స్ మా తండ్రి వ‌ద్ద బాగా డ‌బ్బుంద‌ని అనుకుని, ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

2. నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రాదు?
స‌మాధానం: నా కుటుంబం గ్రామంలోనే ఉంది.. మా తండ్రి అక్క‌డే ఇల్లు క‌ట్టుకుని ఉంటున్నారు.

3.బిగ్ బాస్ షోలో ఎంట్రీకి వైసీపీ నేత అంబటి రాంబాబు నిన్ను ఎందుకు రిఫర్ చేశారు?
స‌మాధానం: బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారిని ముంబయి బృందం వచ్చి సెలెక్ట్ చేసింది. 80 మందిని ఇంటర్వ్యూ చేసి కొందరిని మాత్రమే ఎంపిక చేసింది. వాళ్లు చేసిన ఎంపికకు అంబటి రాంబాబుకు ఏమిటి సంబంధం..

4. నువ్వు ప‌వ‌న్‌ని టార్గెట్ చేసినందుకు వైసీపీని నీకు ఎంత డ‌బ్బు ఇచ్చింది?
స‌మాధానం: నా కోసం నేను పోరాడుతుంటే, నా ఆత్మ‌గౌర‌వం కోసం ప్ర‌శ్నిస్తోంటే వైసీపీ నా వెనుక ఉందంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు ఆయ‌న ఫ్యాన్స్ సామాజిక విధ్వంసకారులుగా త‌యార‌య్యారు.

5. గ్రామ వాసులను చిట్టీల పేరుతో నీ తల్లి ఎందుకు మోసం చేసింది ఎందుకు?
సమాధానం: నా తల్లి ఎన్నడూ చిట్టీలు వేయలేదు. ఆమె కేన‌్సర్‌తో రెండేళ్ల క్రితం చనిపోయింది.

6. నువ్వు నీ సోదరి భర్తను బెదిరించి డబ్బులు లాగడానికి ఎవరు సాయం చేశారు?
సమాధానం: ఆయ‌న పేరు కృష్ణ భ‌గ‌వాన్‌.. ఆయ‌న త‌న ఉద్యోగాన్ని చేసుకుంటూ బ‌తుకుతుంటాడు.. నా సోద‌రి జీవితం ఇప్పుడు సంతోషంగా ఉంది. న‌న్ను దెబ్బ తీయాల‌నే ఉద్దేశంతో నా కుటుంబంపై ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

7. నీ కుటుంబం ఎటువంటి తప్పూ చేయకపోతే సంక్రాంతికి సొంత గ్రామానికి ఎందుకు రాలేదు?
సమాధానం: నేను సంక్రాంతికి నా ఊరికి వెళ్లాను.. నా తండ్రి కూడా ఆ ఊరిలోనే ఉన్నారు. అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్లి వస్తూనే ఉన్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here