పవన్ కళ్యాణ్ ను మళ్ళీ తగులుకున్న కత్తి..!

కత్తి మహేష్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరిగిన వివాదం అంతా ఇంతా కాదు. ఎన్నో రోజులు వారి మధ్య సోషల్ మీడియా లోనూ.. టీవీ ఛానల్స్ లోనూ వార్ నడిచింది. చివరికి ఎలాగోలా పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య సయోధ్య కుదిరింది. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గానే ఉన్న కత్తి మహేష్ మరోసారి తన ట్వీట్ తో దుమారం రేపాడు.

“జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పంథాలోనే జీహుజురి ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి ఉంది. ఇది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదు. ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజం.” అంటూ కత్తి మహేష్ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఇళ్ళు, జనసేన ఆఫెస్ కు శంకుస్థాపన చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కత్తి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక దీనిపై మరోసారి దుమారం మొదలైంది. కత్తి మహేష్ వైసీపీ తరపున మాట్లాడుతూ ఉన్నాడని.. అందుకే పవన్ ఏది చేసినా తప్పుగా అనిపిస్తూ ఉంటుందని కామెంట్లు పెట్టారు. మరోసారి ఈ వివాదం ఎటు వైపు వెళ్తుందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here