వాకాడ అప్పారావు గొప్పోడు, మహేష్ కత్తి రేప్ చేశాడు అని అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది..!

జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఫిలిమ్ క్రిటిక్ కత్తి మహేష్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ స్పందించారు. తనను కావాలనే ఇరికించాలని అనుకుంటూ ఉన్నారని.. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఫేస్ బుక్ లైవ్ లో కత్తి మహేష్ చెప్పుకొచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన సునీతపై రూ.50 లక్షల పరువునష్టం దావా వేస్తున్నట్లు మహేష్ మహేష్ చెప్పుకొచ్చారు.

ఆ అమ్మాయి చేసే ఆరోపణలకు ఎక్కడా పొంతనలేకపోవడం, సంబంధం లేకుండా చెప్పడం ఇవన్నీ నాకు షాకింగ్‌గా అనిపించలేదు. కానీ, నేను ‘సైరా’ ఆఫీస్ నుంచి వచ్చాను.. వాకాడ అప్పారావు చాలా గొప్పోడు, మహేష్ కత్తి రేప్ చేశాడు అని ఆ అమ్మాయి ఎప్పుడైతే చెప్పిందో నాకో అనుమానం వచ్చిందని కత్తి మహేష్ లైవ్ లో మాట్లాడారు. తాను కోర్టులో రూ.50 లక్షలకి పరువునష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు. నాకున్న ధర్మ సందేహం ఏంటంటే.. దీనిలో సైరా ఆఫీసులో ఉన్న వాకాడ అప్పారావు, కొణిదెల ప్రొడక్షన్స్ హస్తం ఉందా? లేదా? అన్నది తేలాలి అని మహేష్ ఆరోపించారు. కొన్ని రోజులు అందరూ వెయిట్ చేయాలని.. అన్నిటికీ సమాధాణాలు వస్తాయని కత్తి మహేష్ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మరిన్ని విషయాలు..

Accusations and defamations.

Mahesh Kathiさんの投稿 2018年4月14日(土)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here