కత్తి మహేష్ నీ తల్లి గురించి సీక్రెట్ ఏంటి అన్న నెటిజన్ పోస్ట్ పై స్పందించిన పూనమ్ కౌర్..!

ఓ మీడియా సమావేశంలో కత్తి మహేష్ ను నీ తల్లి గురించి ఓ రెండు నిమిషాలు చెప్పు అని అనడంతో ఏమీ మాట్లాడుకుండా ఇది పద్ధతి కాదు అని కత్తి మహేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు. కత్తి మహేష్ నీ తల్లి గురించి ఉన్న సీక్రెట్ ఏంటి అని కొందరు ట్వీట్లు చేశారు. అయితే దీనిపై పూనమ్ కౌర్ స్పందించింది.

ఎవరైనా సరే ఆ వ్యక్తి తల్లిని కించపరుస్తూ మాట్లాడకూడదని వ్యాఖ్యానించింది. దయచేసి కత్తి మహేష్ తల్లిని గురించి ఎలా పడితే అలా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ గురించి కత్తి మహేష్ చేస్తున్న ట్వీట్లకు పూనమ్ కౌర్ కూడా ఓ ట్వీట్ పెట్టింది. దీనికి కత్తి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. పవన్ తో సన్నిహితంగా ఉంది పూనమ్ కౌర్ అని కూడా కత్తి మహేష్ వ్యాఖ్యానించాడు. అయితే దీన్ని ఏమీ పట్టించుకోని పూనమ్ కౌర్ కత్తి మహేష్ తల్లిని అనగానే ఎవరి తల్లి గురించి తప్పుగా మాట్లాడే అర్హత లేదని చెప్పేసింది. ఈ ట్వీట్ కింద కత్తి మహేష్ కూడా ట్వీట్ చేయడం విషయం. చాలా మెచ్యూర్ ట్వీట్ అని కత్తి మహేష్ పూనమ్ కౌర్ ట్వీట్ కు స్పందించాడు.

https://twitter.com/KathiMaheshh/status/950082686906900480

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here