దమ్ముంటే పవన్ కళ్యాణ్, హీరోయిన్ పూనమ్ కౌర్ అక్కడికి రండి..!

కత్తి మహేష్ రోజు రోజుకీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వెళుతున్నాడు. ఆ వివాదంలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా రావడంతో ఆమెను కూడా కత్తి మహేష్ వదలలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. అతని భార్యల విషయంలో పలు కామెంట్లు చేశాడు కత్తి మహేష్. అతడి అభిమానుల దెబ్బకు తాను ఎంతగానో విసిగిపోయానని కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ ను పవర్ బ్రోకర్ అని కూడా అన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కు.. హీరోయిన్ పూనమ్ కౌర్ కు సవాల్ విసిరాడు కత్తి మహేష్.

‘మీరో నేనో తేల్చుకుందాం.. దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్.. మీ బండారం నేను బయటపెడతా.. వస్తారా?’ అని అన్నారు. రేపు ఉదయం(ఆదివారం) 11 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ వద్దకు వస్తానని, దమ్ముంటే తన ముందుకు రావాలని, తాను ఓపెన్ చాలెంజ్ చేస్తున్నానని చెప్పారు.

కత్తి మహేష్ చేసిన ట్వీట్..!
@poonamkaurlal and @PawanKalyan tomorrow at 11am I will be at Basheerbagh press club to face you. If you are dare enough, come and confront me in open. మీరో నేనో తేల్చుకుందాం. దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్. మీ బండారం నేను బయటపెడతా. వస్తారా!? అయితే ఆ తర్వాత లొకేషన్ చేంజ్ అంటూ.. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కు రమ్మని పిలిచాడు.

‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లే… నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు’ అంటూ జనసేన అధినేత పవన్ చేసిన ఈ ట్వీట్ పట్ల కూడా కత్తి మహేష్ అదే స్థాయిలో స్పందించాడు. ‘ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్… నేను కాదు’ అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here