అప్పట్లో అమ్మాయిలకు ఆడిషన్ నిర్వహించిన కత్తి మహేష్.. ఇప్పటికీ మెసేజ్ లు పెడుతున్నాడట..!

కత్తి మహేష్ సినీ విమర్శకుడిగానే కాకుండా.. దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించాడు. అయితే అతనిలోని మరో కోణాన్ని రిపోర్టర్ సినిమా నిర్మాత ‘రాంకీ’ బయటపెట్టారు. కత్తి మహేష్ ఆడిషన్స్ సమయంలోనూ.. షూటింగ్ లో ప్రవర్తించిన తీరునూ బయటపెట్టారు రాంకీ.

రాంకీ మాట్లాడుతూ.. కత్తి మహేష్‌ని ‘రిపోర్టర్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తప్పుచేశానన్నారు. మొదట దర్శకుడిగా ఉన్న మహేష్.. వారం రోజుల్లోనే యూనిట్ మొత్తాన్ని తన ప్రవర్తనతో విసిగించినట్లు రాంకీ వెల్లడించారు. దీంతో ఆ సినిమా నుంచి మహేష్‌ని తప్పించి.. ఎన్. శంకర్‌తో చిత్రీకరణను పూర్తి చేసినట్లు చెప్పారు. టిఫిన్ రాలేదని అలిగి వెళ్ళిపోవడం.. షాట్ కట్ చెప్పకుండా ఫోన్ చూసుకుంటూ ఉండేవాడని చెప్పాడు. సీనియర్‌ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు లాంటి వారు ఓపికగా పనిచేస్తుంటే.. మహేష్ నిర్లక్ష్యంగా వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు.

చాలా కారణాలతో కత్తి మహేష్ డైరెక్టర్‌గా పనికిరాడని సినిమా నుంచి తప్పించామని ఆయన చెప్పారు. సినిమాలో ముఖ్య పాత్రల కోసం దాదాపు 200 మంది అమ్మాయిలకి అతను ఆడిషన్ చేశాడు. ఆడిషన్‌కి వచ్చిన అమ్మాయిలకి ఇప్పటికీ కత్తి మహేష్ మెసేజ్‌లు పెడుతున్నాడని వారి నుంచి తనకు కంప్లయింట్లు వచ్చాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ కి, అతని అభిమానులకు ఒక్కసారి క్షమాపణలు చెప్పాలని హితవు పలికారు. దీనిపై కత్తి మహేష్ ఏమని స్పందిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here