ఇప్పటివరకూ ఏ అమ్మాయికీ ముద్దే పెట్టలేదు అని చెప్పాడు.. ఇక అంతే..!

అమెరికన్ ఐడల్ టీవీ షో.. ట్యాలెంట్ ఉన్న సింగర్స్ ను వెతికి తీసుకొని వచ్చే అమెరికన్ టీవీ షో..! కొన్ని కొన్ని సార్లు ఆ టీవీ షోలో ఆసక్తికర ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ టీవీ షోకు ప్రముఖ హాలీవుడ్ సింగర్ కేటీ పెర్రీ జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఆమె ముందు ఓ కంటెస్టెంట్ తన వయసు 19 సంవత్సరాలని ఇప్పటివరకూ తాను ఏ అమ్మాయినీ ముద్దు పెట్టుకోలేదని చెప్పాడు.

బెంజమిన్ గ్లైజీ అనే 19 ఏళ్ల యువకుడు షోకు వచ్చాడు. తాను క్యాషియర్ గా పనిచేస్తూ మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నానని జడ్జిలైన కేటీ పెర్రీ, లియోనెల్ రిచీ, ల్యూక్ బ్రయాన్ ముందు చెప్పాడు. తాను ఇప్పటివరకూ ఏ అమ్మాయితోనూ రిలేషన్ షిప్ లో లేనని.. అందుకే ఇప్పటివరకూ ఏ అమ్మాయినీ ముద్దు పెట్టుకోలేదని చెప్పాడు. తాను అమ్మాయితో రిలేషన్ షిప్ లో లేకుండా ఎలా ముద్దు పెట్టుకోగలను అని ప్రశ్నించాడు. అయితే జడ్జీలు అతన్ని తమ దగ్గరకు రమ్మని పిలిచారు.

33 సంవత్సరాల కేటీ పెర్రీ తనను ముద్దు పెట్టుకోమని ఆ యువకుడిని కోరింది. ఆ యువకుడు ఆశ్చర్యపోతూ కేటీ బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే కేటీ పెర్రీ స్పందిస్తూ నువ్వు ముద్దు పెట్టుకున్నావ్ సరే.. కనీసం పెట్టుకున్నట్లు సౌండ్ కూడా రాలేదని చెప్పుకొచ్చింది. ఇంకో సారి పెట్టుకో అని చెప్పింది. ఆ యువకుడు రెండో సారి ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించగా కేటీ లిప్ టు లిప్ కిస్ ఇచ్చేసింది. పక్కనే ఉన్న జడ్జిలు కూడా ఆశ్చర్యపోయారు. అయితే బెంజిమన్ మాత్రం తన సింగింగ్ ట్యాలెంట్ తో జడ్జిలను మెప్పించలేకపోయాడు. తర్వాతి రౌండ్ కు వెళ్ళే అవకాశం దక్కలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here