పేదింటి ఆడపిల్లలకు ఇకపై 1,00,116 రూపాయలు ప్రకటించేసిన కేసీఆర్..!

భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో వరాలు ఇవ్వడంలో కేసీఆర్ తర్వాతనే ఏ ముఖ్యమంత్రి అయినా అని అంటూ ఉంటారు. ఇప్పటికే ప్రతి ఒక్క విభాగంలోనూ ఉన్న సమస్యలను తీరుస్తూ కేసీఆర్ ముందుకు వెళుతున్నారు. ఇక విద్యార్థులకు స్కాలర్ షిప్ ల విషయంలోనూ.. పలు పథకాల విషయంలోనూ కేసీఆర్ ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు. ఇక తెలంగాణలో ముఖ్యమైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచేశారు కేసీఆర్. ఇకపై ఈ పథకం కింద పేదింటి ఆడపిల్లలకు 1,00,116 రూపాయలు ఇవ్వనున్నారు.

అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇకపై కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ఇస్తున్న మొత్తాన్ని లక్షా నూటపదహారు రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ పథకం కింద అందే సాయాన్ని తొలుత రూ. 51 వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం ఆ తరువాత దాన్ని రూ. 75 వేలకు పెంచుతూ ఇప్పుడు 1,00,116 రూపాయలు చేసేశారు.

ఈ పథకం కింద ఇప్పటి వరకు 3.65 లక్షల మందికి లబ్ది చేకూరిందని అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. పేదరికం ప్రజలను ఎన్నో రకాలుగా వేధిస్తుందని, పెళ్లి ఖర్చుకు భయపడి భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయని, ఎంతో మంది అవివాహితలుగా మిగులుతున్నారని అందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here