కర్ణాటక లోని తెలుగు ప్రజలంతా జేడీఎస్ పార్టీకే ఓటు వేయాలన్న కేసీఆర్..!

కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర పార్టీల‌ను ఏక‌తాటిపైకి తీసుకొచ్చి, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ కొద్దిరోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా- ఆయ‌న ఇదివ‌ర‌కే కోల్‌క‌తలో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌త బెన‌ర్జీతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ రోజు జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) అధినేత, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌తో ఆయ‌న స‌మావేశం అయ్యారు. బెంగ‌ళూరులోని దేవెగౌడ నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు కె కేశ‌వ‌రావు, వినోద్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌, మిష‌న్ భ‌గీర‌థ ఛైర్మ‌న్ ప్ర‌శాంత్ రెడ్డి ఉన్నారు. వారితో ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కూడా ఉన్నారు.

ఈ చర్చల అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో నివసిస్తున్న తెలుగు ప్రజలంతా దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్ పార్టీకే ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేవేగౌడ, కుమారస్వామిల కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ జేడీఎస్ కోసం ప్రచారం కూడా నిర్వహిస్తానని ఆయన తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో ఏం జరగబోతోందో మీరు చూస్తారని చెప్పి వెళ్ళిపోయారు. వ‌చ్చేనెల 12వ తేదీన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రగ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here