ఇప్పుడు కేసీఆర్ చేసిన పని.. భరత్ అనే నేను సినిమాలో ఉండి ఉంటే బాగున్ను..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్టైలే వేరు కాబట్టి..! తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సామాన్యుడి కూతురి పెళ్ళికి వెళ్ళారు. అది కూడా ఆ వ్యక్తి పిలవకుండానే..! హైవేలో వెళుతున్న కేసీఆర్ ఓ పెళ్ళి జరుగుతుండడం చూసి.. తన కాన్వాయ్ ను అటుగా మళ్ళించి.. అక్కడకు వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇలాంటి సన్నివేశం అచ్చం సినిమాలో లాగే లేదూ..!

రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ వెళ్ళారు. ఈ పథకాన్ని ప్రారంభించి కరీంనగర్-వరంగల్ రహదారిలో వెళుతుండగా పల్లెటూరైన తాడికల్ లో పెళ్లి జరగడాన్ని చూశారు. దీంతో ఆయన ప్రయాణిస్తున్న బస్సును ఆపించారు. బస్సు దిగిన ఆయన నేరుగా పెళ్లి మండపంలోకి వెళ్లారు. సీఎం కేసీఆర్ ను చూసిన పెళ్లికొడుకు, కుమార్తెలతో పాటూ అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి మండపంలోకి వెళ్లిన కేసీఆర్ అక్కడి వారిని నమస్కరించి.. వధూవరులు కావ్య.. మనోహర్ ల దగ్గరకు వెళ్లి ఆక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆ తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ఆర్థిక సాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here