ఒక పేషెంట్ బదులు వేరొకరికి బ్రెయిన్ సర్జరీ చేసిన డాక్టర్.. పేషెంట్ ఏమయ్యాడంటే..!

మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం.. ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి చేస్తూ ఉంటారు. అదే ఘటనలే నిజజీవితంలో జరిగితే చాలా కష్టం. కానీ అలాంటి ఘటన నిజంగా కెన్యాలో చోటుచేసుకుంది. ఒక పేషెంట్ బదులు వేరే పేషెంట్ కు బ్రెయిన్ సర్జరీ చేసి.. నాలుక కరచుకున్నారు కెన్యా హాస్పిటల్ నిర్వాహకులు.

కెన్యాలోని అతి పెద్ద ఆసుపత్రిలో కెన్యట్టా నేషనల్ ఆసుపత్రి ఒకటి. ఇటీవలి కాలంలో ఆ ఆసుపత్రి మీద.. ఆసుపత్రి లోని వైద్యుల మీద విపరీతమైన ఫిర్యాదులు వస్తున్నాయి. పేషెంట్లను వైద్యులు లైంగికంగా వేధిస్తున్నారన్నదే కాకుండా.. అనవసరమైన ఆపరేషన్లు చేస్తూ ఉన్నారని. కానీ ఏకంగా ఒకరికి బదులు మరొకరికి బ్రెయిన్ సర్జరీ చేసిన ఘటన అక్కడి మీడియాలో సంచలనం అవుతోంది.

న్యూరోసర్జన్ దగ్గరకు ఇద్దరు పేషెంట్లు వచ్చారు. ఒక వ్యక్తి బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టిందని సర్జరీ చేయాలని చెప్పారు. మరొక పేషెంట్ తల బాగా ఉబ్బడంతో అతడికి ఏదైనా మందులు రాసివ్వాల్సి ఉండేది. అయితే ఇదేదీ పట్టించుకోని న్యూరోసర్జన్ తన టీమ్ తో పాటూ మందులు రాసివ్వాల్సిన వ్యక్తికి బ్రెయిన్ సర్జరీ చేశారు. ఆపరేషన్ పూర్తీ అవుతున్న దశలో అతడికి ఎలాంటి రక్తం గడ్డ కట్టలేదని.. పేషెంట్ మారిపోయాడని గుర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి పెద్దలు న్యూరోసర్జన్ నూ.. సర్జరీలో పాలు పంచుకున్న నర్సులను సస్పెండ్ చేసేశారు. అనవసరంగా సర్జరీ చేయించుకున్న పేషెంట్ ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నాడు. అతడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here