పంజాగుట్ట పోలీస్‌స్టేష‌న్‌ను సంద‌ర్శించిన ముఖ్య‌మంత్రి!

హైద‌రాబాద్‌: దేశంలోనే రెండో అత్యుత్త‌మంగా గుర్తింపు పొందిన పంజ‌గుట్ట పోలీస్‌స్టేష‌న్‌ను కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ సంద‌ర్శించారు. సీపీఎం జాతీయ మ‌హాస‌భ‌ల్లో పాల్గొన‌డానికి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. గురువారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌ను సంద‌ర్శించారు.

అక్క‌డ అనుస‌రిస్తోన్న ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానాలు, ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌, ఇంట‌ర్నెట్ అనుసంధానం వంటి విధానాల‌పై పంజ‌గుట్ట ఏసీపీ, సీఐ, ఎస్ఐల‌ను అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్‌లోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

కేసుల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల గురించి తెలుసుకోడానికి ఆస‌క్తి చూపారు. పినరయి విజయన్‌ రాక సందర్భంగా పంజాగుట్టలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. అనంత‌రం వారిని ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here