ఆ న‌ర్సు ప్రాణ త్యాగం ఖ‌రీదు..అంతేనా!

ప్రాణాంత‌క వైర‌స్ సోకింద‌ని తెలిసీ, చూస్తూ చూస్తూ ఆ రోగిని అలాగే వ‌దిలి వేయ‌లేదా న‌ర్సు. వైర‌స్ సోకితే త‌న‌కూ చావు త‌ప్ప‌ద‌ని తెలుసు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె వెనుకాడ‌లేదు. ధైర్యంగా ఆ రోగికి వైద్య సేవ‌లు అందించారు. త‌న వృత్తి ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించారు. త‌న వృత్తికి సార్థ‌క‌త క‌ల్పించారు. ఆ రోగికి సోకిన వైర‌స్ బారిన ప‌డి తానూ త‌నువు చాలించారు.

కేర‌ళ కోజికోడ్ జిల్లా పెరంబ్రాకు చెందిన న‌ర్సు లిని పుథుస్సేరి ఉదంతం ఇది. సాధార‌ణంగా- ఇలాంటి ప‌రిస్థితుల్లో మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటుంది ఏ ప్ర‌భుత్వ‌మైనా. కేర‌ళ ప్ర‌భుత్వం కూడా అదే చేసింది. లిని కుటుంబానికి న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌క‌టించింది. న‌ష్ట ప‌రిహారంతో పాటు భ‌ర్త సంజేష్‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇస్తామ‌ని హామీ ఇచ్చింది అక్క‌డి ప్ర‌భుత్వం. లిని త్యాగానికి కేర‌ళ‌లోని క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం క‌ట్టిన ఖ‌రీదు అయిదు ల‌క్ష‌ల రూపాయ‌లు, ఓ ప్ర‌భుత్వ ఉద్యోగం. ఉద్యోగం ఇచ్చే మాట అటుంచితే- ఆమె చేసిన ప్రాణ త్యాగానికి ఈ మొత్తం స‌రిపోద‌నే అభిప్రాయం అక్క‌డ వెల్లువెత్తుతోంది.

లిని త్యాగానికి కేర‌ళ‌లోని క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం క‌ట్టిన ఖ‌రీదు అయిదు ల‌క్ష‌ల రూపాయ‌లు. ఆమె చేసిన ప్రాణ త్యాగానికి ఈ మొత్తం స‌రిపోద‌నే అభిప్రాయం అక్క‌డ వెల్లువెత్తుతోంది. స‌రైన స‌మ‌యంలో వైర‌స్ సోకిన రోగికి లిని వైద్య స‌హాయం గ‌న‌క అందించక‌పోయి ఉంటే- ఆ వైర‌స్ మ‌రింత ప్ర‌బ‌లిపోయి ఉండేద‌ని, వైర‌స్ వ్యాపించ‌కుండా లిని త‌న ప్రాణాన్ని అడ్డేసింద‌నే భావ‌న అంద‌ర్లోనూ వ్య‌క్త‌మౌతోంది.

అలాంటి కుటుంబానికి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన న‌ష్ట ప‌రిహార మొత్తం స‌రిపోద‌ని అంటున్నారు. కేర‌ళ‌లో ఉన్న‌ది క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం. సాధార‌ణంగా- ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌మ్యూనిస్టు కార్య‌క‌ర్త‌లు.. రోడ్డెక్కి బాధిత కుటంబానికి అండ‌గా ఉంటారు. ప్ర‌భుత్వం పెద్ద మొత్తంలో న‌ష్ట ప‌రిహారాన్ని ప్ర‌క‌టించేంత వ‌ర‌కూ నిద్ర‌పోరు. నిద్ర‌పోనివ్వ‌రు. ధ‌ర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నాల‌తో అట్టుడికిస్తారు.

కేర‌ళ‌లో సాక్షాత్తూ క‌మ్యూనిస్టుల ప్ర‌భుత్వ‌మే ఉన్న‌ప్ప‌టికీ.. త‌క్కువ మొత్తాన్ని ప‌రిహారంగా ప్ర‌క‌టించింద‌నే అభిప్రాయం మ‌ల‌యాళీల్లో నెల‌కొంది. కేర‌ళ‌ను కుదిపేస్తోన్న నిఫా వైర‌స్ మొట్ట‌మొద‌టి సారిగా సోకిన రోగుల‌కు ఆమె చికిత్స అందించారు. ఆ వైర‌స్ సోకి లిని కూడా మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here