రుతుస్రావంపై క‌విత రాసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు..దాడి! ఆసుప‌త్రిలో బాధిత విద్యార్థిని

తిరువ‌నంత‌పురం: రుతుస్రావంపై ఓ పద్యాన్ని రాసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయ‌డం ఆమె పాప‌మైంది. కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆ ప‌ద్యం రాసిన సోద‌రి మీద దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బ‌ల‌తో ఆమె ఆసుప‌త్రి పాల‌య్యారు. అక్క‌డితో ఆగ‌కుండా త‌మ‌ను చంపుతామ‌ని బెదిరిస్తున్నారంటూ బాధితురాలు చెబుతున్నారు.

ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని ప‌త్తినంతిట్ట జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ముళ్ల‌ప‌ళ్లై గ్రామానికి చెందిన న‌వమి రామ‌చంద్ర‌న్ అనే న్యాయ శాస్త్ర విద్యార్థిని ఈ ప‌ద్యాన్ని రాశారు. రుతుస్రావం స‌మ‌యంలో ఏర్ప‌డే ఇబ్బందుల గురించి ఆమె ప‌ద్య రూపంలో రాసి, సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కొంద‌రు యువ‌కులు త‌మ‌ను చంపుతామ‌ని బెదిరించార‌ని, వారు చెప్పిన‌ట్టే చేశార‌ని న‌వమి రామ‌చంద్ర‌న్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న త‌న సోద‌రి ల‌క్ష్మి సైకిల్‌పై స్కూల్ నుంచి ఇంటికి వ‌స్తుండ‌గా.. బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెపై దాడి చేశార‌ని చెప్పారు.

ఈ దాడిలో ల‌క్ష్మి తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని, ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని అన్నారు. న‌వమి రామ‌చంద్ర‌న్ క‌మ్యూనిస్టు కుటుంబానికి చెందిన యువ‌తి. ఆమె తండ్రి క‌మ్యూనిస్టు నాయ‌కుడు.

ഇതു വായിച്ചു രക്തം തിളയ്ക്കുന്ന അഭിനവ ഹിന്ദു സംരക്ഷകർക്ക് തെറിവിളി നടത്താനുള്ള പോസ്റ്റ്‌. 😏സഖാവ് ശ്യാമ കുണ്ടംകുഴിയെ സപ്പോർട്ട് ചെയ്യുന്നു……………. .💪💪💪

Navami Ramachandranさんの投稿 2018年2月16日(金)

న‌వమి కూడా ఎస్ఎఫ్ఐలో చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్ర‌త్య‌ర్థులు దాడి చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. ఇది ఏబీవీపీ లేదా ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌ల ప‌ని అయి ఉంటుంద‌ని ఆరోపిస్తున్నారు.

പ്രിയപ്പെട്ടവരെ കഴിഞ്ഞ ദിവസം അനിയത്തിക്ക് നേരെ ഭീഷണിയാണ് ഉണ്ടായതെങ്കിൽ ഇന്ന് ആക്രമണമാണ് ഉണ്ടായത്. കാലത്തെ പാല് മേടിക്കാൻ…

Navami Ramachandranさんの投稿 2018年2月20日(火)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here