చివరికి చెప్పులో సెల్ ఫోన్ పెట్టాడు.. అమ్మాయిల వద్దకు వెళ్ళి నిలుచునేవాడు..!

ఇప్పటికే ఎక్కడెక్కడ స్పై కెమెరాలు ఉన్నాయో అని మహిళలు చాలా భయపడుతూ ఉంటారు. షాపింగ్ మాల్స్ లో, బాత్ రూమ్స్ లో, ట్రయల్స్ రూమ్ లో ఎక్కడ పడితే అక్కడ మహిళలను రికార్డ్ చేస్తూ దొరికిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఓ యువకుడు ఏకంగా తన చెప్పునే స్పై కెమెరాగా మార్చేశాడు. అమ్మాయిల దగ్గరకు వెళ్ళి నిలబడి వారిని కింద నుండి రికార్డ్ చేసేవాడు. చెప్పులో సెల్‌ఫోన్ పెట్టి, దాని కెమెరా ద్వారా అమ్మాయిల ఫొటోల‌ను అస‌భ్య‌కోణంలో తీసిన యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కేరళకు చెందిన బైజు హిద్ అనే యువకుడు ఈ చెత్త పని చేశాడు. త్రిస్సూర్‌లో జ‌రుగుతున్న కేర‌ళ క‌ల్సోత్స‌వానికి వివిధ క‌ళాశాలల విద్యార్థినీ విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వారిలో బైజు కూడా ఉన్నాడు. ఇత‌డు ప‌దేప‌దే కాళ్ల వైపు చూస్తుండటం, అమ్మాయిలు ఎక్కువ‌గా ఉన్న చోట్ల తిరుగుతుండ‌టం, కొన్నిసార్లు చెప్పులు లేకుండా క‌నిపించ‌డంతో పోలీసుల‌కు అనుమానం వచ్చింది.

అప్పుడు అతడు చెప్పిన దానిని విని వాళ్ళు కూడా షాక్ తిన్నారు. త‌న కాలి చెప్పులో ఓ సెల్‌ఫోన్‌ను ఉంచానని, కెమెరా పైకి క‌నిపించేలా చెప్పు రంధ్రంలో ఇమడ్చి వీడియోలు తీస్తూ ఉన్నానని చెప్పుకొచ్చాడు. కాలు తొక్కితే ఫోన్ పాడ‌వ‌కుండా ఉండేందుకు ఫోన్ చుట్టూ గ‌ట్టి స్టీల్ క‌వ‌రింగ్ కూడా చేయించాడు. ఒక‌వేళ ఫొటోలు తీసే ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ఫోన్‌ను సిద్ధంగా ఉంచుకున్నాడు. పోలీసుల ముందు చేసిన తప్పు ఒప్పుకున్నాడు. మరీ ఇంత నీచానికి దిగజారుతావా అని అతడి స్నేహితులే అనరాని మాటలు అన్నారు. ప్రస్తుతం బైజు పోలీసుల వద్ద ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here