డేటింగ్ కోసం పాకులాడిన ఎన్నారై.. ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే..!

విదేశీ వనితతో డేటింగ్ కోసం పాకులాడిన ఓ ఎన్నారై ఏకంగా ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రాణాలను తీశాడు. మొదట ఎవరో గ్యాంగు ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావించారు. కానీ అతడికి ఎటువంటి విభేదాలూ.. లేవని తేలింది. ఇక ఆ వ్యక్తిని చంపాలని ఎవరు అనుకుంటారు అన్న కోణంలో పోలీసులు ఆరాతీశారు. చనిపోయిన వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ ను కలిశారు. ఎవరి మీదైనా నీకు డౌట్ ఉందా అని అడిగారు.. తనకు ఎవరి మీద అనుమానాలు లేవని చెప్పేసింది. మాటల్లో తనను ఒక వ్యక్తి డేటింగ్ కు పిలిచేవాడని.. కానీ తాను రానని చెప్పేదాన్ని అని పోలీసులకు సమాచారం అందించింది. కానీ పోలీసుల అనుమానమే నిజమైంది. చంపింది ఆ డేటింగ్ కు పిలిచిన వ్యక్తి అని అర్థం అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ ను అడ్డు తొలగించుకుంటే యువతి తన సొంతం అవుతుందన్న దుర్భుద్ధితో ఈ పని చేశాడు ఎన్నారై.

కెవిన్ ప్రసాద్ (31) శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ సేవలందిస్తున్నాడు. అక్కడే ఉన్న యువతితో కెవిన్ పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత డేటింగ్ కు సిద్ధమయ్యాడు. ఆమెను చాలా సార్లు ఫోర్స్ కూడా చేశాడు. కానీ ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు. మార్క్ మంగాక్కట్ (31) అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, తమకు మూడేళ్ల బిడ్డ కూడా ఉందని చెప్పింది. ఆ వ్యక్తిని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నిన కెవిన్ ముసుగు ధరించి మంగాక్కట్ కారు వద్దకు వచ్చి అతన్ని తుపాకితో కాల్చి చంపాడు. తన స్నేహితుడైన డొనోవాన్ మ్యాథ్యూ రివీరా సహాయంతో అతను మంగాక్కట్ ను హత్య చేశాడు.

అతని గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రసాద్ సహోద్యోగినిని విచారిస్తున్న క్రమంలో, పనిచేసే చోట ఓ యువకుడు తనను డేటింగ్ కు రావాలని ఒత్తిడి చేస్తుండేవాడని ఆమె చెప్పగా, పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. దీంతో ప్రసాద్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. అతనికి మరణశిక్ష లేదా జీవితఖైదు విధించవచ్చు అని అక్కడి న్యాయనిపుణులు అంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here