రోడ్డు పక్కన టిఫిన్ తిని.. 10వేల రూపాయలు ఇచ్చి వెళ్ళిన ఈగ సుదీప్..!

ఈగ సినిమా ద్వారా కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. తాజాగా ఆయన రోడ్డు పక్కన టిఫిన్ తిని.. ఆ హోటల్ యజమానికి ఏకంగా 10వేల రూపాయలు ఇచ్చి వెళ్ళాడు. ఈ విషయాన్ని కన్నడ నాట తెగ చర్చించుకుంటూ ఉన్నారు.

సుదీప్ ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అందులో భాగంగా బళ్ళారిలో గాలి వర్గీయులు శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డిల తరపున ప్రచారానికి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఓబుళాపురం దగ్గర రోడ్ షో చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన రేకుల షెడ్డులో ఉన్న హోటల్ లో చిత్రాన్నం తిని టీ తాగాడు. వెంటనే బిల్లు ఇవ్వడానికి లేచిన సుదీప్ ఆ షాప్ యజమాని అయిన రాధకు 10వేల రూపాయలు ఇచ్చాడు. ఆమె వద్దు అని చెప్పింది.. అయినప్పటికీ సుదీప్ నీ బిడ్డలకు ఏమైనా తీసివ్వమ్మా అని చెప్పి 10 వేల రూపాయలు తీసుకోమని అడిగాడు. చూడడానికి చాలా చిన్న హోటల్ లా ఉందమ్మా.. ఎన్నికల ప్రచారానికి వచ్చానని డబ్బులు ఇవ్వడం లేదు.. నీ హోటల్ లో భోజనం బాగుంది అందుకే ఇస్తున్నా అని చెప్పాడు. దీంతో ఆమె డబ్బులు తీసుకుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న అభిమానులతో ఫోటోలు దిగాడు సుదీప్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here