ఇంజనీర్ ను కిడ్నాప్ చేశారు.. గన్ను పెట్టి అమ్మాయితో పెళ్ళి చేశారు.. అక్కడ అబ్బాయిల పరిస్థితి అంతే..!

సాధారణంగా అమ్మాయిలను బెదిరించి అబ్బాయిలు పెళ్ళి చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ అబ్బాయిల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాస్త చదువుకున్న అబ్బాయి ఉన్నాడంటే చాలు.. అతడిని కిడ్నాప్ చేసి తమ అమ్మాయికి పెళ్ళి చేసేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంతకూ ఎక్కడ అనే కదా మీ అనుమానం. ఇంకెక్కడ బీహార్ లో..! తాజాగా అలాగే ఓ ఇంజనీర్ కు బలవంతంగా పెళ్ళి చేశారు. అతడు ఏడుస్తూ తాళి కట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బినోద్ అనే వ్యక్తిని.. అతడి కుటుంబాన్ని బెదిరించి పెళ్ళి తంతు పూర్తీ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ఘటన జరిగి దాదాపు నెల పైనే అయిందట..! బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఇంజినీర్‌గా చేస్తున్న బినోద్ కుమార్ ఇటీవల తన మిత్రుడి పెళ్లికి వెళ్లాడు. ఆ పెళ్లిలో ఓ వ్యక్తి బినోద్‌కు పరిచయం అయ్యాడు. అక్కడ నుంచి వాళ్లు పాట్నాకు వెళ్లారు.

ఆ పరిచయమైన ఆ వ్యక్తి బినోద్‌ను బలవంతంగా తన చెల్లల్ని పెళ్లి చేసుకునేలా చేశాడు. బినోద్ పెళ్ళి వద్దని ఎంత ఏడుస్తున్నా కూడా పెళ్ళి చేశారు. ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లాలంటూ బినోద్ ఇంట్లో వాళ్లకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనకు న్యాయం చేయమని బినోద్ పోలీసులను ఆశ్రయించాడు.

Aurangabad: Police personnel arrive to control the situation following RPI activists’ violent protest in Aurangabad on Tuesday over the clashes that broke out during 200th anniversary celebrations of the Battle of Bhima in Koregaon, near Pune. PTI Photo (PTI1_2_2018_000117B)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here