బార్ డ్యాన్సర్ హత్య కేసులో షాకింగ్ విషయాలు.. బంగళా కూడా కొనిచ్చాడు..!

కొద్దిరోజుల క్రితం ప్రీతేష్ పటేల్ అనే వ్యక్తి ముంబై కి చెందిన బార్ డ్యాన్సర్ జ్యోతిని తన ఫామ్ హౌస్ లో అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపాడు. అయితే ఈ హత్య చేసి దొరికిన తర్వాత ప్రీతేష్ పటేల్ తాను రెండు కోట్ల రూపాయలు పైనే జ్యోతి కోసం ఖర్చు చేశానని చెప్పుకొచ్చాడు. కానీ ఇది నిజమని ఎవరూ నమ్మలేదు. అయితే అతడు చెప్పింది నిజమేనని తెలుస్తోంది. ఆమె అనుభవించిన లగ్జరీ లైఫ్ కు కారణం ప్రీతేష్ అని తేలింది.

భటిండాలో జ్యోతీ కోసం ఓ విలాసమైన బంగాళా కొనిచ్చాడు ప్రీతేష్. అప్పటికే అతడికి పెళ్ళి అయినప్పటికీ ఆమెను ప్రేమించాడు. బంగాళా తీసివ్వడమే కాకుండా కారు కూడా కొనిచ్చాడు. బంగారు నగలు, నెక్లెస్ లు కూడా ఆమెకు ఇచ్చాడు. దాదాపు ఆమెకు కావాల్సిన అన్ని అవసరాలు అతడే చూసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆమెకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసిన పలు డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

జ్యోతి, ప్రీతేష్ పటేల్ లు తరచూ కలిసి సహజీవనం చేస్తుండే వారు. జ్యోతి జన్మదినోత్సవం సందర్భంగా డిసెంబరు 27న ఆమె ప్రియుడు ప్రీతేష్ పటేల్ ఫాం హౌస్ కు వచ్చింది. ఇద్దరూ కలిసి జన్మదినోత్సవంతోపాటు కొత్తసంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. జ్యోతికి మరో యువకుడితో సంబంధం ఉందనే అనుమానంతో ఇద్దరు ప్రేయసీప్రియుల మధ్య వాగ్వాదం జరిగింది. అంతే ప్రీతేష్ పటేల్ కొడవలితో జ్యోతి తలను నరికి చంపేసి పరారయ్యాడు. జ్యోతితో వచ్చిన డ్రైవరు సందీప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here