ఉత్త‌రం.. ద‌క్షిణం క‌లిశాయి!

ఉత్త‌ర‌, ద‌క్షిణ ధృవాలు గానీ, దిక్కులు గానీ క‌లిసేవి కావు. ఇక్క‌డ మాత్రం ఆ రెండూ క‌లిశాయి. ఆప్యాయంగా చేతులు క‌లుపుకొన్నాయి. సాదారంగా ఆహ్వానం ప‌లికాయి. ఆ దిక్కుల పేర్లు ఉత్త‌ర కొరియా, ద‌క్షిణ కొరియా. ఈ రెండు దేశాల అధినేతలు భేటీ అయ్యారు.

త‌న దేశం నుంచి న‌డుచుకుంటూ వ‌చ్చిన ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జొంగ్ ఉన్‌.. ద‌క్షిణ కొరియాలో అడుగు పెట్టారు. కుడికాలు ముందు పెట్టి స‌రిహ‌ద్దు గోడను దాటారు. ఆగ‌ర్భ శ‌తృ దేశంగా భావించే ద‌క్షిణ కొరియాలోనికి అడుగు పెట్టారు. ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టించిన మొట్ట‌మొద‌టి ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడెవ‌రైనా ఆ దేశ చ‌రిత్ర‌లో ఉన్నారంటే.. అది కిమ్ జొంగ్ ఉన్ మాత్ర‌మే.

ఇప్ప‌టిదాకా- ద‌క్షిణ కొరియాలో ఉత్త‌ర కొరియా అధ్య‌క్షులెవ‌రూ ప‌ర్య‌టించ‌లేదు. స‌రిహ‌ద్దు గోడ వ‌ద్ద ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు మూన్‌-జ‌యీ.. ఆయ‌న‌ను సాద‌రంగా ఆహ్వానించారు. స‌రిహ‌ద్దు గోడ‌కు అటువైపు కిమ్ జొంగ్‌.. ఇటు వైపు మూన్‌.. ప‌ర‌స్ప‌రం చేతులు క‌లుపుకొని కొద్దిసేపు ముచ్చ‌టించారు.

ఆ త‌రువాత‌- మూన్‌.. సాద‌రంగా త‌మ దేశంలో అడుగు పెట్టాల‌ని ఆయ‌న‌ను ఆహ్వానించారు. ఇద్ద‌రు దేశాధినేత‌లు చేతులు క‌లుపుకొని, స‌రిహ‌ద్దు గోడ‌కు అటు-ఇటు న‌డిచారు. అనంత‌రం- ద‌క్షిణ కొరియా అధికారిక అధ్య‌క్ష భ‌వ‌నానికి వెళ్లారు. ఇద్ద‌రు నేత‌లూ ఉల్లాసంగా క‌నిపించారు. `కొరియ‌న్ యుద్ధం ఇక ముగిసింది..` అంటూ ఉన్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here