ఏంటి.. ఇది నిజమే.. కిమ్-ట్రంప్.. కలవబోతున్నారా..!

కొద్ది రోజుల క్రితం ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్.. ఎప్పుడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడా అని అందరూ భయపడ్డారు. అయితే ఇప్పుడు కిమ్ శాంతి కామకుడిగా మారినట్లు తెలుస్తోంది. శాంతి చర్చలు తాను జరపడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేయడమే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను కలవడానికి కూడా సిద్ధమేనని ప్రకటించాడు. దీనికి ట్రంప్ కూడా ఓకే చెప్పేయడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సౌత్ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ ఈ యాంగ్ మొత్తం పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రయత్నించాడట.. అందులో భాగంగానే ట్రంప్ ఈ భేటీకి ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది.

అణు పరీక్షలకు, క్షిపణి ప్రయోగాలను ఆపేందుకు, సౌత్ కొరియాతో కలసి సంయుక్త సైనిక విన్యాసాలు చేసేందుకు కిమ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మే నెలలోగా ట్రంప్, కిమ్ భేటీ ఉంటుందని, అందుకు ట్రంప్ సైతం అంగీకరించారని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరలో ట్రంప్ ను కలుసుకోవాలని కిమ్ కూడా భావిస్తున్నారని, వీరి భేటీ చరిత్రాత్మకమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వింటర్ ఒలింపిక్స్ తరువాత ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణం చల్లబడడం విశేషం. ఏది ఏమైనా శాంతి కోరుకోవడం నిజంగా ఆహ్వానించదగిన విషయమే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here