కిమ్ శర్మ కు మొదలైన కష్టాలు.. కారు కూడా ఇచ్చేయాల్సిందే..!

కిమ్ శర్మ.. మన తెలుగు వాళ్ళకే కాకుండా బాలీవుడ్ వాళ్లకు కూడా ఈ పేరు బాగా పరిచయమే.. ఎందుకంటే షారుఖ్, అమితాబ్ లు నటించిన మొహబ్బతే సినిమాలో పెద్ద రోల్ లో నటించింది కాబట్టి.. అలాగే తెలుగులో ‘ఖడ్గం’ సినిమా ద్వారా మన వాళ్లకు బాగా దగ్గరైంది. అయితే ఆ తర్వాత మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో డ్యాన్స్ చేసినప్పటికీ ఆమె కెరీర్ పెద్దగా పుంజుకోలేదు . ఇక క్రికెటర్ యువరాజ్ సింగ్ తో పెళ్లి దాదాపు ఖాయమే అనుకున్న తరుణంలో వారి రిలేషన్ షిప్ కూడా బెడిసికొట్టింది. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని.. ఇటీవలే విడాకులు కూడా తీసుకుంది. ఇప్పుడు ఆమె మీద ఓ వ్యాపారవేత్త పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశాడు.

కిమ్ శర్మపై రాజస్థాన్ వ్యాపారవేత్త దిలీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలో తనకు నివాసం లేకపోవడానికి తోడు, ముంబై-రాజస్థాన్ మధ్య తరచు ప్రయాణించాల్సి రావడం వల్ల తన రేంజ్ రోవర్ లగ్జరీ కారును కిమ్ శర్మ, ఆమె భర్త అలీ పుంజానీ నివాసం ఉండే ఖర్ రెసిడెన్సీలో పార్క్ చేసుకునే వాడినని దిలీప్ కుమార్ తెలిపారు. ఏడాది క్రితం కిమ్ తన కారును వాడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పాడు. ఆమెను ఈ విషయమై అడుగగా ఆ కారును తన భర్త తనకు ఇచ్చాడని తిరిగి ఇచ్చేది లేదని చెప్పింది. దీంతో తాను 2017 సెప్టెంబర్ లో దీనిపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. అప్పట్లో దీనిపై పోలీసులు కిమ్ శర్మకు బదులుగా ఆమె భర్త అలీ పుంజానీపై కేసు నమోదు చేశారు. వారిద్దరూ విడిపోవడమే కాకుండా.. ప్రస్తుతం కిమ్ శర్మ దగ్గర మాత్రమే ఆ కారు ఉండడంతో ఆమె పేరు మీదనే కేసు రిజిస్టర్ చేయాలని పోలీసులకు ఫిర్యాదునిచ్చారు. ప్రస్తుతం కిమ్ శర్మ కెరీర్ కూడా అంత గొప్పగా లేదు. ఆపైన ఇలాంటి ఆరోపణలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here