టీ20ల్లో ఏ భారత ఆటగాడు అలా అవుట్ అవ్వలేదు.. ఫైనల్ దాదాపు చేరినట్లే..!

ఇప్పటివరకూ టీ20ల్లో ఏ భారత ఆటగాడు అలా అవుట్ అవ్వలేదు.. కానీ లోకేష్ రాహుల్ ఆ అపప్రదను మూటగట్టుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ జీవన్ మెండిస్ వేసిన బంతిని ఆడేందుకు బ్యాక్‌ఫుట్ వేసిన రాహల్ ప్రమాదవశాత్తు బెయిల్స్‌ను పడగొట్టి హిట్ వికెట్ అయ్యాడు. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో హిట్ వికెట్ అయిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో లాలా అమర్‌నాథ్, వన్డేల్లో నయన్ మోగింయా హిట్ వికెట్ అయిన తొలి భారతీయులుగా రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు టీ20ల్లో లోకేశ్ రాహుల్ మొదటి వ్యక్తి అయ్యాడు.

ఇక ఈ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించడంతో దాదాపు ఫైనల్ చేరినట్లే. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 19ఓవర్లకి కుదించారు. శ్రీలంక 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (55) అర్ధసెంచరీతో రాణించాడు. నాలుగు వికెట్లతో శార్ధుల్ ఠాకుర్ రాణించగా, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశాడు, జయదేవ్ ఉనద్కత్, శంకర్, చాహల్ చెరొక వికెట్ తో ఆకట్టుకున్నారు. ఇక లక్ష్య చేధనలో భారత ఓపెనర్లు తొందరగా అవుట్ అయినప్పటికీ మిగిలిన బ్యాట్స్మెన్ శ్రీలంక బౌలర్లకు నిలదొక్కుకునే ఛాన్స్ ఇవ్వలేదు.

లోకేష్ రాహుల్ 18 పరుగులు చేసి అవుటవ్వగా. సురేష్ రైనా (27) దూకుడుగా ఆడి రన్ రేట్ నెమ్మదించకుండా చూశాడు. ఆ తర్వాత మనీశ్ పాండే (42), దినేష్ కార్తిక్ (39) సంయమనంతో ఆడుతూ లక్ష్యం ఛేదించారు. నాలుగు వికెట్లతో రాణించిన శార్థుల్ ఠాకూర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ ఆదివారం జరగబోయే ఫైనల్ కు దాదాపు చేరినట్లే. బుధవారం బంగ్లాదేశ్ తో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here